హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మాయావతి!

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మాయావతి!

బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)

బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)

మాయావతి ఇప్పుడు తమను కాదని అజిత్ జోగితో చేతులు కలపడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడని పరిణామంగా మారింది.

  ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కాదని అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌తో జట్టు కట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. తమ కూటమి తరఫున అజిత్ జోగి సీఎం అభ్యర్థిగా ఆమె ప్రకటించారు. పొత్తులో భాగంగా బీఎస్పీ 35 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని, అజిత్ జోగి పార్టీ 55 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు.

  ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించుతామని అజిత్ జోగి మీడియా సమావేశంలో ధీమా వ్యక్తంచేశారు.

  కాంగ్రెస్‌తో జరిపిన పొత్తు చర్చలు విఫలంకావడంతో బీఎస్పీ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము కోరినన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ఆమె...అజిత్ జోగి టీమ్‌లో చేరిపోయారు. ఆ రాష్ట్రంలో 12 శాతం మంది దళిత ఓటర్లు ఉండడం, అజిత్ జోగి పార్టీ తమ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉండడంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకోనున్నట్లు గతంలో కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

  మాయావతి ఇప్పుడు తమను కాదని అజిత్ జోగితో చేతులు కలపడం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడని పరిణామంగా మారింది.అటు ఈ తాజా పరిణామం పట్ల బీజేపీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

  2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయగా...ఆ పార్టీ అభ్యర్థి ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించారు. బీఎస్పీకి మొత్తం 4.3 శాతం ఓట్లు దక్కాయి.

  Published by:Janardhan V
  First published:

  Tags: Bsp, Mayawati

  ఉత్తమ కథలు