హోమ్ /వార్తలు /national /

తెలంగాణలో బడుగులకు అన్యాయం: బీఎస్పీ అధినేత్రి మాయావతి

తెలంగాణలో బడుగులకు అన్యాయం: బీఎస్పీ అధినేత్రి మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి (ఫైల్ ఫొటో)

బీఎస్పీ అధినేత్రి మాయావతి (ఫైల్ ఫొటో)

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  తెలంగాణ ఎన్నికల్లో ;పార్టీ ప్రచారం హోరెత్తతుతోంది. జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణలో పర్యటించారు. నిర్మల్, మంచిర్యాల్ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మాయావతి.. తెలంగాణలో, కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

  అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలతో  బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని మాయావతి విమర్శించారు. రాష్ట్రంలో బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆమె.. తమ పార్టీ ఎవ్వరితోనూ పొత్తు పొట్టుకోలేదన్నారు. తెలంగాణలో 100 సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని.. పేదవర్గాల అభ్యున్నతి కోసం వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

  రాష్ట్రంలో, దేశంలో అవినీతి పెరిగిపోయిందని మాయావతి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. అలాంటి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. పేదల అభివృద్ధి కోసం పాటుపడే బీఎస్పీని గెలిపించుకుని.. కాన్షీరాం కన్న కలల్ని నిజం చేసుకుందామని పిలుపునిచ్చారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Bjp, Bsp, Mayawati, Telangana, Telangana Election 2018, Telangana News, Trs

  ఉత్తమ కథలు