హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కండీషన్స్ అప్లై: కాంగ్రెస్‌తో దోస్తీపై మాయావతి

కండీషన్స్ అప్లై: కాంగ్రెస్‌తో దోస్తీపై మాయావతి

మాయావతితో సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

మాయావతితో సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

మాయావతి సహకారం లేకుండానే రాజస్థాన్‌లో గెలుస్తామని.. అలాంటప్పుడు బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఐతే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటున్నారు నేతలు.

  2019 లోక్‌సభ ఎన్నికలకు ఇఫ్పటి నుంచే వ్యూహాలు మొదలయ్యాయి. కూటమి రాజకీయలు జోరందుకున్నాయి. ఐతే అంతకంటే ముందు రాష్ట్రాల్లో రిహార్సల్స్ మొదలు పెట్టేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్సాహం కనబరుస్తోంది.

  ఐతే చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీఎస్పీతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపుతోంది. రాజస్థాన్‌లో ఒంటరిగానే పోటీచేయాలని భావిస్తోంది. కానీ మాయావతి మాత్రం...మూడు రాష్ట్రాల్లోనూ కలిసి పోటీ చేద్దామని పట్టుబట్టుతున్నారు. లేదంటే అసలు పొత్తు ఊసే వద్దని  స్పష్టంచేసినట్లు సమాచారం.

  చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో దళితుల జనాభా ఎక్కువగానే ఉంది. వారి ఓట్లను క్యాష్ చేసుకుంటే ఈ సారి అధికారంలోకి రావొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే దళిత్ పార్టీగా పేరున్న బీఎస్పీతో పొత్తుకు సిద్ధమవుతోంది. అందుకు మాయావతి కూడా సిద్ధంగానే ఉంది. ఐతే రాజస్థాన్‌లోనూ పొత్తు పెట్టుకుందామన్న ప్రతిపాదనను కాంగ్రెస్ ముందుంచింది బీఎస్పీ. కానీ అక్కడి నేతలు మాత్రం వద్దంటున్నట్లు సమాచారం

  రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ  మధ్యే అధికార పగ్గాలు మారుతున్నాయి. ఒకసారి బీజేపీ గెలిస్తే,  మరో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. దాన్ని బట్టి చూస్తే.. ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాయావతి సహకారం లేకుండానే రాజస్థాన్‌లో గెలుస్తామని.. అలాంటప్పుడు బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఐతే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటున్నారు నేతలు.

  మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి ప్యాకేజ్ డీల్‌కు మాయవతి పట్టుబట్టుతున్నారు. లేదంటే అసలు ఎక్కడా పొత్తు వద్దంటున్నారు. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఒంటరిగా పోటీచేద్దామంటున్నారు అక్కడి నేతలు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మాయాతో పొత్తు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కే పరిమితమవుతుందా? లేదంటే రాజస్థాన్ సహా మూడు రాష్ట్రాల్లో కలిసి పోటీచేస్తారా? అన్నతి తేలాల్సి ఉంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bsp, Congress, Mayawati, Sonia Gandhi

  ఉత్తమ కథలు