ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని అటుపై ప్రాంతీయ పార్టీగా మారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్ నేడు జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న దృక్పధంతో పొరుగు రాష్ట్రమైన మహరాష్ట్ర(Maharashtra)లో పంచాయితీ ఎన్నికల బరిలో నిలబడిన బీఆర్ఎస్ అభ్యర్ధి ఉపఎన్నికల్లో ప్రత్యర్ధిపై 115ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. బీఆర్‌ఎస్(BRS)కు ఫస్ట్ విక్టరీని తెచ్చిపెట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల కోసం పని చేసేందుకు మరింత ఉత్సాహాన్ని నింపింది. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్(Chhatrapati Sambhajinagar)లో గంగాపూర్ తాలుకా అంబేలోహల్ గ్రామపంచాయితీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి గఫార్ సర్దార్ పఠాన్(Gafar Sardar Pathan) 115ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ప్రస్తుతం మహరాష్ట్రలోని 288నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యదర్శకులకు నాందేడ్‌లో రాష్ట్ర స్థాయి శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండ్రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగానే గ్రామపంచాయితీ ఎన్నికల్లో బోణి కొట్టడం శుభపరిణామంగా చూస్తోంది.
మహారాష్ట్రలో బోణి కొట్టిన బీఆర్ఎస్ ..
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచనలకు అనుగూణంగానే పొరుగు రాష్ట్రాల్లో ఫలితాలు వస్తున్నాయి. మహరాష్ట్రలో గ్రామపంచాయితీ ఉపఎన్నిక జరిగిన స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించి తొలి విజయాన్ని అందించాడు. ఛత్రపతి సంభాజీనగర్ అంబేలోహల్ గ్రామ పంచాయితీకి గురువారం ఉపఎన్నిక జరిగింది. దానిఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గఫార్ సర్దార్ పఠాన్ 115ఓట్ల మెజార్టీతో గెలిచాడు. గత నెలలో శంభాజీనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించడం..అక్కడే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో గులాబీ దండులో మంచి జోష్ కనిపిస్తోంది.
BRS National President and Hon’ble Chief Minister Sri K Chandrashekhar Rao inaugurated BRS training camp in Nanded, Maharashtra today. pic.twitter.com/b9jZj0N3Jj
— BRS Party (@BRSparty) May 19, 2023
గులాబీ జెండా ఎగురవేయాలని..
దేశ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు మరికొంత సమయం ఉండటంతో మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కార్యదర్శలకు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ నాందేడ్‌లో ఉన్నారు. శుక్ర, శనివారాల్లో ఈశిక్షణ తరగతులు కొనసాగుతాయి. ఓవైపు రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్‌కు తొలి విజయం దక్కడంతో నాందేడ్ శిక్షణ శిభిరంతో పాటు బీఆర్ఎెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది.
విస్తరించాలనే ప్రయత్నం..
కేంద్రంలో బీజేపీని గద్దె దించడం, ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దీనికి అనుకూలంగానే కర్నాటక ఫలితాల్లో బీజేపీ ఓడిపోవడంతో కాస్త సంతోషంలో ఉన్న బీఆర్ఎస్ ..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మినిమమ్ గ్యారెంటీ సీట్లు వస్తాయనే ధీమాలో ఉంది. ముఖ్యంగా తమ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, Elections, Maharashtra