హోమ్ /వార్తలు /national /

Kodali Nani: మంత్రి కొడాలి నాని నివాసంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Kodali Nani: మంత్రి కొడాలి నాని నివాసంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా..యలమర్రు పామర్రు పరిధిలో ఉంది.

కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా..యలమర్రు పామర్రు పరిధిలో ఉంది.

Kodali Nani: ఇటీవల ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంత్రి కొడాలి నాని నివాసంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.

  ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలి నాని ఇంట్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఆయన నివాసంలో గురువారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నం నుంచి వచ్చిన యాంటీ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది స్నైపర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లతో మంత్రి నివాసంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. మంత్రి ప్రయాణించే వాహనాలను కూడా తనిఖీ చేశారు. అంతేకాదు బాంబ్ స్క్వాడ్ తనిఖీల తర్వాత మంత్రి కొడాలి నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యల గురించి మంత్రి నివాసానికి వచ్చే వారిని మెటల్ డిటెక్టర్లు, స్కానర్లతో తనిఖీలు చేసిన తర్వాతే.. లోపలికి అనుమతిస్తున్నారు.

  ఇటీవల ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంత్రి కొడాలి నాని నివాసంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.

  కాగా, నవంబరు 29న మచిలీపట్నంలో ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి తన ఇంట్లో ఉండగానే నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు అతడిని పట్టుకొని నిలువరించారు. మంత్రిపై దాడి చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి.. దాడికి యత్నించాడు. మంత్రి అనుచరులు అప్రమత్తమవడంతో పేర్ని నాని తృటిలో తప్పించుకున్నారు. అనంతరం తాపీ మేస్త్రి నాగేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  మంత్రి పేర్నినాని తల్లి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్దకర్మ కార్యక్రమాల అనంతరం.. అందరూ భోజనాలకు బయలుదేరారు. మంత్రి పేర్ని నాని.. తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడేందుకు గేట్ వద్దకు వచ్చారు. అదే సమయంలో నాగేశ్వరరావు మంత్రి వద్దకు వచ్చి, కాళ్లు మొక్కుతున్నట్లు నటించాడు. తాపీతో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అతడిని వెనక్కి లాగారు. ఐతే నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kodali Nani

  ఉత్తమ కథలు