హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat polling : బీజేపీ అభ్యర్థిపై దాడి..తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు తరలింపు!

Gujarat polling : బీజేపీ అభ్యర్థిపై దాడి..తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు తరలింపు!

Image source : ANI

Image source : ANI

BJP MLA Candidate Attacked : రెండు దశల్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Elections) తొలి విడత పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్(First Phase Polling).. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

BJP MLA Candidate Attacked : రెండు దశల్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Elections) తొలి విడత పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్(First Phase Polling).. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.  రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరుగుతున్న 89 సీట్లు..కచ్- సౌరాష్ట్ర,దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని 19 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. తొలి దశలో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర (Independent) అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

మొదటి దశలో ఎన్నికలు జరగుతున్న 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో.. బీజేపీ 48, కాంగ్రెస్ 40, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఇవాళ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో నవ్‌సారి జిల్లాలోని జారి గ్రామంలో వాన్‌స్దా అసెంబ్లీ నియోజకవ బీజేపీ అభ్యర్థి పీయూష్ పటేల్‌పై దాడి జరిగింది. చిఖిల్ టౌన్ నుంచి కారులో ఇంటికి తిరిగి వస్తున్న పీయూష్ పటేల్ పై జారి గ్రామ సమీపంలో 30 నుంచి 40 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతనిపై దాడి చేసి కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో పీయూష్ పటేల్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా, అతన్ని కోర్టెజ్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అనంత్ పటేల్, ఆయన మద్దతుదారులే దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి పీయూష్ పటేల్‌ ఆరోపించారు.

Amit Shah: రాహుల్ గాంధీ యాత్రపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆప్‌కు అంత సీన్ లేదంటూ..

ఇక, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచి వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తుండగా..అప్పుడెప్పుడో గుజరాత్ లో కోల్పోయిన ప్రభను తిరిగి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మోదీ సొంత ఇలాఖాలో విజయం సాధించి మోదీకి తానే ప్రత్యామ్నాయం అని చూపెట్టాలని ఆప్ అధినేత కేజ్రీవాల్  ఉవ్విళ్లూరుతున్నారు.

First published:

Tags: Bjp, Gujarat Assembly Elections 2022