హోమ్ /వార్తలు /national /

టార్గెట్ రోజా...2024 కోసం అభ్యర్థులు రెడీ ?

టార్గెట్ రోజా...2024 కోసం అభ్యర్థులు రెడీ ?

YSRCP MLA Roja | వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించేందుకు నగరిలో ఇప్పటి నుంచే ఆమె ప్రత్యర్థులను రంగంలోకి దింపాలని ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    గ్లామర్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సినీనటి రోజా... రాజకీయాల్లోనూ బాగా సక్సెస్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయిన రోజాకు మంత్రి పదవి కూడా వస్తుందని అంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో... ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ కీలకమైన నామినేటెడ్ పోస్ట్‌ను సొంతం చేసుకున్న రోజా... విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రోజా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్‌గా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించేందుకు నగరిలో ఇప్పటి నుంచే ఆమె ప్రత్యర్థులను రంగంలోకి దింపాలని ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    గతంలో రోజాపై పోటీకి వెటరన్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ను బరిలోకి దింపాలని భావించింది టీడీపీ. అయితే ఆ తరువాత ఆ ప్రతిపాదనను ఎందుకనో పక్కపెట్టింది. అయితే తాజాగా రోజాపై బహుబాషా నటి ప్రియారామన్‌ను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే నగరిలో పర్యటించారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో టీడీపీ కూడా మరోసారి రోజాపై పోటీకి వాణీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపనుందనే ప్రచారం మొదలైంది. గ్లామర్‌ను గ్లామర్‌తోనే దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ, బీజేపీ రోజాకు పోటీగా హీరోయిన్లను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి... నిజంగానే రోజాకు పోటీగా వెటరన్ హీరోయిన్లు రంగంలోకి దిగుతారేమో చూడాలి.

    First published:

    Tags: Andhra Pradesh, Bjp, Nagari, Rk roja, TDP, Ysrcp

    ఉత్తమ కథలు