Home /News /national /

POLITICS BJP SWEEPS ELECTIONS TO UP LEGISLATIVE COUNCIL LOSES KEY VARANASI SEAT PVN

UP MLC Elections: మోదీ నియోజకవర్గంలో బీజేపీకి ఘోర పరాజయం..మాఫియా డాన్ భార్య విజయం

వారణాశి ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

వారణాశి ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

Varanasi MLC Election : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నమోదు చేసుకున్న వారాల వ్యవధిలోనే జరిగిన ఎమ్మెల్సీ బీజేపీ ఘన విజయాన్ని రికార్డ్ చేసింది. ఉత్తరప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఇందులో ఖాళీగా ఉన్న 36 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా జరిగిన యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ..

ఇంకా చదవండి ...
UP MLC Elections : ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ బీజేపీ ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తరప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నమోదు చేసుకున్న వారాల వ్యవధిలోనే జరిగిన ఎమ్మెల్సీ బీజేపీ ఘన విజయాన్ని రికార్డ్ చేసింది. ఉత్తరప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఇందులో ఖాళీగా ఉన్న 36 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా జరిగిన యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ.. కీలకమైన వారణాశిలో మాత్రం ఓటమి చవిచూసింది. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (UP MLC ELECTIONS)ఎన్నికల్లో.. బీజేపీ మొత్తం ఎన్నికలు జరిగిన 36 సీట్లలో.. బీజేపీ 30కిపైగా సీట్లల్లో ముందంజలో ఉంది.

ఈ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. కానీ, ఫలితాల సరళి ద్వారా బీజేపీ శాసన మండలిలోనూ తన బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నట్టు అర్థమవుతోంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి ఎమ్మెల్సీ సీటును మాత్రం బీజేపీ కోల్పోయింది.జైలులో ఉన్న మాఫియా డాన్,స్థానికంగా గ‌ట్టి ప‌ట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్న‌పూర్ణ సింగ్ బీజేపీ అభ్య‌ర్థి అన్న‌పూర్ణ సింగ్ బీజేపీ అభ్య‌ర్థి సుధామ ప‌టేల్‌ను ఓడించారు. వార‌ణాసి- చందౌలి, బ‌ధౌలీ ఎమ్మెల్సీ సీటు నుంచి అన్న‌పూర్ణ సింగ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దిగి, విజ‌యం సాధించింది.

ALSO READ Shocking : కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం..మధ్యలో ఆపేద్దామంది..కత్తితో దారుణంగా 16 పోట్లు

1998 నుంచి బ్రిజేష్ కుటుంబం ఇక్కడ తమ పట్టు సాగిస్తూ వస్తోంది. 2016లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని దించలేదు. ఒకరకంగా అప్పుడు స్వతంత్రంగా బరిలోకి దిగిన బ్రిజేష్ సింగ్‌ కు సహకారాన్ని ఇచ్చింది. కానీ, ఈ సారి ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దించింది. కానీ, ఈ సారి ఆయన సతీమణిపై బలమైన పోటీని కూడా బీజేపీ ఇవ్వలేకపోయింది. వారణాసి సీటులో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక ప్ర‌తాప్‌గ‌ఢ్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీ ఓట‌మి చ‌విచూసింది. రాజా భ‌య్యా సన్నిహితుడు అక్ష‌య్ ప్ర‌తాప్ సింగ్ బీజేపీ అభ్య‌ర్థి హ‌రి ప్ర‌తాప్ సింగ్‌ను ఓడించారు. ఇక ఆజంగ‌ఢ్‌ లోనూ బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్సీ య‌శ్వంత్ త‌న కుమారుడు విక్రాంత్ సింగ్‌ ను ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోకి దింపారు. బీజేపీ త‌న అభ్య‌ర్థిగా ర‌కామాంత్ యాద‌వ్‌ను దింపింది. పార్టీపై య‌శ్వంత్ తిరుగుబాటు చేసినా.. త‌న కుమారుడు విక్రాంత్ సింగ్‌ ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు.

ALSO READ Sri Lanka Crisis : అప్పులు తీర్చం..ఆర్థిక సంక్షోభ సమయంలో శ్రీలంక సంచలన ప్రకటన

ఇక,ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి యొక్క సమర్థ మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు జాతీయవాదం, అభివృద్ధి మరియు సుపరిపాలన వెంట ప్రజలు ఉన్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం మరోసారి స్పష్టం చేసింది" అని ఆయన ట్వీట్ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Mlc elections, Pm modi, Uttar pradesh, Varanasi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు