POLITICS BJP SPECIAL FOUCS ON 144 SEATS WHICH THE PARTY NOT WIN IN 2019 ELECTIONS AK
BJP 2024: బీజేపీ బిగ్ ప్లాన్.. ఆ 144 సీట్లలో గెలిచేందుకు ప్రత్యేక వ్యూహం.. వీరికి బాధ్యతలు
మోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)
BJP Plan For 2024: దేశవ్యాప్తంగా 144 సీట్లు కోల్పోయినట్లు బీజేపీ గుర్తించింది. ఈ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. 100 బలహీన బూత్‌లను ఎంపీలందరికీ, 25 బలహీన బూత్‌లను ఎమ్మెల్యేలకు కేటాయించి వాటిపై కసరత్తు చేసే బాధ్యతను గతంలో బీజేపీ అప్పగించింది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) ఓడిపోయిన 144 సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహం సిద్ధం చేసేందుకు బీజేపీ(BJP) ఓ టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో యూపీలోని (Uttar Pradesh)బస్తీ ఎంపీ హరీశ్ ద్వివేది, ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీ నరేష్ బన్సాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రలకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇందులో యూపీలోని 14 స్థానాల బాధ్యతలను ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎంపీ నరేష్ బన్సాల్‌కు అప్పగించారు.
దేశవ్యాప్తంగా 144 సీట్లు కోల్పోయినట్లు బీజేపీ గుర్తించింది. ఈ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇది అన్ని రాష్ట్రాలకు వెళ్లి ఈ స్థానాలను గెలుచుకోవడానికి ప్రత్యేక వ్యూహం చేస్తుంది. పార్లమెంట్ సభ్యుడు హరీష్ ద్వివేది, ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎంపీ నరేష్ బన్సాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రకు ఈ అన్ని స్థానాల బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ప్రతిపక్షం చేతిలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలను గెలుచుకునే బాధ్యతను ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎంపీ నరేష్ బన్సాల్‌కు అప్పగించారు. ఈ స్థానాల్లో బీజేపీ ఓటమికి కారణం.. ఈ స్థానాల్లో బూత్‌లను బలోపేతం చేయడం వంటి అంశాల నుంచి మరింత మందిని కలుపుకునేందుకు బీజేపీ నేతలు కృషి చేయనున్నారు.
లక్నోలో ఓడిపోయిన సీట్లకు సంబంధించి సమావేశం జరగనుంది. ఇందులో నరేష్ బన్సాల్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్, సంస్థ మంత్రి సునీల్ బన్సాల్ పాల్గొంటారు. దీంతో పాటు మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను కూడా ఈ సమావేశంలో పిలిచారు. దీనికి ముందు బీజేపీ తన ఎంపీలందరికీ 100 బలహీన బూత్‌లను, 25 బలహీన బూత్‌లను ఎమ్మెల్యేలకు గుర్తించి వాటిపై పని చేసే బాధ్యతను అప్పగించింది. బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలకు మిషన్ మోడ్‌లో సన్నాహాలు ప్రారంభించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.