హోమ్ /వార్తలు /national /

Pawan Kalyan-BJP: పవన్ కళ్యాణ్‌కు బీజేపీ షాక్.. తిరుపతిలో పోటీపై క్లారిటీ

Pawan Kalyan-BJP: పవన్ కళ్యాణ్‌కు బీజేపీ షాక్.. తిరుపతిలో పోటీపై క్లారిటీ

ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కులం కాపులే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు  వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు. ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ భీమవరం, గాజువాకలో పవన్ ఓటమి. దీనికి కారణం కూడా లేకపోలేదు తాను కుల రాజకీయాలు చేయనని.., కులాలు, మాతాలకు తాను అతీతుడినని పవన్ ప్రకటించడంతో కాపులు పవన్ ను తమవాడిగా భావించలేదనే చర్చలు సాగాయి.

ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కులం కాపులే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు. ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ భీమవరం, గాజువాకలో పవన్ ఓటమి. దీనికి కారణం కూడా లేకపోలేదు తాను కుల రాజకీయాలు చేయనని.., కులాలు, మాతాలకు తాను అతీతుడినని పవన్ ప్రకటించడంతో కాపులు పవన్ ను తమవాడిగా భావించలేదనే చర్చలు సాగాయి.

Pawan Kalyan-BJP: కొద్దిరోజుల క్రితం తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్... తిరుపతి అభ్యర్థి ఎంపికపై ఇరు పార్టీల నేతలతో కలిపి ఓ కమిటీని వేస్తామని అన్నారు. ఆ కమిటీ సూచనల ఆధారంగానే ఎవరు పోటీ చేస్తారో తెలుస్తుందని వెల్లడించారు.

Pawan Kalyan-BJP తిరుపతిలో జనసేన, బీజేపీ కూటమి తరువాత ఎవరు బరిలోకి దిగాలనే అంశాన్ని ఇరు పార్టీల ప్రతినిధులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే ఈ కమిటీ నిర్ణయం తీసుకుందో లేక బీజేపీ సొంతంగానే తిరుపతిలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ.. తిరుపతి రోడ్ షోలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తిరుపతిలో నిర్వహించిన రోడ్ షోలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించిన ఏపీ బీజేపీ ఛీప్ సోము వీర్రాజు... తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

అంతేకాదు... జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ప్రజలు ఓటు వేయాలని ఆయన మరోసారి నొక్కి చెప్పడం ఇక్కడ మరో విశేషం. సునీల్ దేవధర్ సహా పలువురు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్న ఈ రోడ్ షోలో సోము సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు బీజేపీ నేతలు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమై... తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలోనే తిరుపతిలో బీజేపీ పోటీపై ఓ క్లారిటీ రావొచ్చని పలువురు భావిస్తున్నారు.

ఈ సమావేశం తరువాత జరిగిన రోడ్ షోలోనే సోము వీర్రాజు తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని.. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పడంతో.. తిరుపతిలో పోటీ చేయాలనుకుంటున్న జనసేనకు నిరాశ తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జనసేన... ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించింది.

అయితే బీజేపీ మాత్రం సొంతంగానే బరిలోకి దిగింది. దీంతో బీజేపీకి మద్దతు ఇస్తూ పోటీ నుంచి తప్పుకోవాలని జనసేన నిర్ణయించింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తరువాత రాష్ట్రానికి తిరిగొచ్చిన అనంతరం.. తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్... తిరుపతి అభ్యర్థి ఎంపికపై ఇరు పార్టీల నేతలతో కలిపి ఓ కమిటీని వేస్తామని అన్నారు. ఆ కమిటీ సూచనల ఆధారంగానే ఎవరు పోటీ చేస్తారో తెలుస్తుందని వెల్లడించారు. అయితే తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలతో... తిరుపతిలోనూ బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారనే విషయం స్పష్టమైంది.

First published:

Tags: Andhra Pradesh, Bjp, Pawan kalyan, Tirupati Loksabha by-poll

ఉత్తమ కథలు