హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat Bjp: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సంచలన నిర్ణయం..ఏడుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్..నామినేషన్ వేయడమే కారణం!

Gujarat Bjp: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సంచలన నిర్ణయం..ఏడుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్..నామినేషన్ వేయడమే కారణం!

బీజేపీ

బీజేపీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా టికెట్ ఆశించి భంగపడ్డారు. దీనితో స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ప్రకటించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Assembly Elections) ముందు బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా టికెట్ ఆశించి భంగపడ్డారు. దీనితో స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ప్రకటించారు. ఆ జాబితాలో హర్షద్ వాసవ, అరవింద్ లదాని, చతాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పాటిల్, భరత్ భాయ్ చావ్ డా, ఉదయ్ బాద్ షా, కరన్ భాయ్ బారైయా ఉన్నారు.

  Manguluru Blast : మంగళూరు పేలుడుకు కోయంబత్తూరు ఘటనకు లింకులు..కీలక విషయాలు వెలుగులోకి

  కాగా గుజరాత్ ఎన్నికల (Gujarat Assembly Elections) కోసం బీజేపీ 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కేంద్రమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, భూపేంద్ర యాదవ్, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.  గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానం నుంచే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడజాకు జామ్‌నగర్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి పటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌కు విరాంగామ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. హోంమంత్రి హర్ష్ సంఘవి.. మజుర సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

  Delhi Murder case: ఢిల్లీలో ప్రియురాలిని చంపి శరీర భాగాల్ని బ్యాగులో డేర్‌గా తీసుకెళ్తున్నా వీడియో ఇదే

  కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Assembly Elections)కు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయిన విషయం తెలిసిందే. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.

  హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి.ఇక,  మొత్తం 182 సీట్లున్న గుజరాత్‌లో..  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా..  ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య 111కి చేరుకుంది. ఈసారి ఆమాద్మీ పార్టీ కూడా రంగంలోకి దిగి.. కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతోంది. పంజాబ్ ఎన్నికల మాదిరే సంచలనం సృష్టిస్తామన్న ధీమాతో ఉంది.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Bjp, Gujarat, Gujarat Assembly Elections 2022

  ఉత్తమ కథలు