హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Parliament: 1,000కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

Parliament: 1,000కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు.

మన దేశంలో లోక్‌సభ స్థానాల పెంపు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు దేశంలో లోక్‌సభ స్థానాలను పెంచేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడున్న 543 స్థానాలను వెయ్యి లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తోందని పేర్కొన్నారు. బీజేపీలో ఉండే తన సహచర ఎంపీల ద్వారా ఈ విషయం తెలిసిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

''2024 లోపు లోక్ సభ స్థానాలను 1000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని బీజేపీలో ఉన్న నా సహచర ఎంపీల ద్వారా తెలిసింది. కొత్త పార్లమెంట్ భవనం 100 సీట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఒకవేళ వెయ్యి స్థానాలకు పెంచితే అంతకంటే ముందు ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలి. కీలకమైన ఈ అంశంపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.'' అని మనోజ్ తివారి ట్వీట్ చేశారు.


భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో ఎందుకు 1000 మంది ఎంపీలు ఉండదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 1977లో మన దేశ జనాభా కేవలం 55 కోట్లేనని.. కానీ ఇప్పుడు 130 కోట్లకు చేరిందని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ గతంలో అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ కంటే ముందు జితిన్ ప్రసాద కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, మనదేశంలో ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇందులో 530 సీట్లను రాష్ట్రాలకు కేటాయించగా.. మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.

First published:

Tags: Bjp, Congress, Lok sabha, Parliament

ఉత్తమ కథలు