హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Karnataka CM Change : కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు?సుదీప్ హిందీ వ్యాఖ్యలకి బొమ్మై సపోర్ట్ చేసినందుకేనా!

Karnataka CM Change : కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు?సుదీప్ హిందీ వ్యాఖ్యలకి బొమ్మై సపోర్ట్ చేసినందుకేనా!

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (ఫైల్ ఫోటో)

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (ఫైల్ ఫోటో)

Karnataka CM Change : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బసవరాజ్ బొమైని సీఎంగా తొలగించి మరొకరి ఆ స్థానం కూర్చోబెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందా?

  Karnataka CM Change : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బసవరాజ్ బొమైని సీఎంగా తొలగించి మరొకరి ఆ స్థానం కూర్చోబెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందా?మంగళవారం అమిత్ షా కర్ణాటక పర్యటన సందర్భంగా దీనిపై క్లారిటీ రానుందా?ఇవే ప్రశ్నలు కన్నడ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి కన్నగుడి మదిలో ఇప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణంగా తాజాగా సీఎంని మార్చబోతున్నారు అంటూ కొందరు ఆ రాష్ట్ర నేతలు ప్రైవేట్ సంభాషణల్లో చర్చించుకోగా..అవి బయటికొచ్చాయి. ఉత్తరాఖండ్ లో ఏడాది వ్యవధిలో ముగ్గురు సీఎంలను మార్చి..మళ్లీ వెంటనే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలో కూడా బీజేపీ అధిష్ఠానం ఇదే ఫార్ములాను పాటించనుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న గుజరాత్ లో కూడా ఇటీవల సీఎంని మార్చింది బీజేపీ అధిష్ఠానం. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో కూడా సీఎం మార్పు తథ్యం అని జనం అనుకుంటున్నారు.

  గతేడాది నాటకీయ పరిణామాల మధ్య యడియూరప్పను కర్ణాటక సీఎం పదవి నుంచి ఆ స్థానంలో బసవరాజ్ బొమ్మైని కూర్చొబెట్టింది బీజేపీ హైకమాండ్. అయితే సీఎం పదవి కోల్పోయిన తర్వాత యడియూరప్ప కన్నీళ్లు పెట్టుకోవడం,ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీలో ఉండి రాష్ట్రవ్యాప్తంగా యడియూరప్ప పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత యడియూరప్ప మొయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక,వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో మరోసారి సీఎంని మార్చి ఎవరిని ఆ స్థానంలో బీజేపీ హైకమాండ్ కూర్చోబెట్టాలనుకుంటున్నది ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. అయితే ఐదు సంవత్సరాల టర్మ్ పూర్తికాకుండానే సీఎంలను మార్చే విధానానికి కాంగ్రెస్ పెట్టింది పేరు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నడుుందని చెప్పవచ్చు.

  ALSO READ Extramarital Affair : మరో వ్యక్తితో వివాహేతర సంబంధం..భర్తను చంపి తప్పించుకోడానికి సినిమా స్టైల్ లో స్కెచ్ వేసిన భార్య

  ఇక,ఇటీవల హిందీ ఇక ఏ మాత్రం జాతీయ భాష కాదు అని ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని స్వీకరించాలని హోంమంత్రి అమిత్ షా దేశపౌరులను కోరిన కొద్ది వారాలకే సుదీప్ నుంచి ప్రకటన వెలువడింది. సుదీప్ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటకల ప్రముఖలతో పాటు మాజీ సీఎంలు,ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై కూడా బహిరంగంగా మద్దతు పలికారు. అయితే ఈ విషయంలోనే బసవరాజ్ బొమ్మైపై అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారా?అని కన్నడ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

  మరోవైపు,కర్ణాటకలో సీఎం మార్పు అంటూ వస్తున్న పుకార్తపై మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. సీఎంని మార్చబోతున్నారా అన్న ప్రశ్నకు..తనకు తెలిసినంతవరకూ రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. సీఎం బొమ్మై మంచిగా పనిచేస్తున్నాడంటూ యడియూరప్ప కితాబు ఇచ్చారు. సోమవారం విలేఖరులతో యడియూరప్ప మాట్లాడుతూ..పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. సీఎంని అమిత్ షా కలుస్తారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా ప్రయత్నిస్తారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ,హోం మంత్రి అమిత్ షా కర్ణాటక రాష్ట్రానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ సీట్లు సాధించే దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు,వ్యూహాలపై వారు సలహాలు ఇస్తారు అని యడియూర్ప చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారని యడ్యూరప్ప తెలిపారు.

  ALSO READ Shocking: భార్యను తీసుకెళ్లి స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  అయితే ఈసారి ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను హైకమాండ్ తొలగించనుందని పరోక్షంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చేసిన ప్రసంగాన్ని గురించి అడిగిన ప్రశ్నకు..ఈ విషయం గురించి చర్చించడానికి ఇష్టపడటం లేదని అన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం దీనిని నిర్ణయిస్తుందన్నారు. కొత్త ముఖాల చేరికలోనే పార్టీ బలం ఉందని బీఎల్ సంతోష్ ఆదివారం చేసిన ప్రకటన రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తాజా ఊహాగానాలకు తెరలేపింది. అమిత్ షా రాష్ట్ర పర్యటన సమయంలో అతని ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక,వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎంపై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Basavaraj Bommai, Bjp, Karnataka, Karnataka bjp, Karnataka political crisis, Karnataka Politics

  ఉత్తమ కథలు