హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఆ అంశాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

PM Modi: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఆ అంశాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటరీ లైబ్రెరీ భవనంలో ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటరీ లైబ్రెరీ భవనంలో ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్లమెంట్ లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను ఎదుర్కొనే అంశంపై ప్రధాని సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ ఎంపీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. కాగా ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగడం చర్చనీయాంశంగా మారింది.

Business Ideas: కిన్నో పండ్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్.. ఈ పంటతో రైతులకు అధిక లాభాలు

మొత్తం 2 విడతలలో 66 రోజుల పాటూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో పలు బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Babu Mohan: బీజేపీ కార్యకర్తను చెప్పుతో కొడతానన్న బాబు మోహన్ .. వైరల్ అవుతున్న మాజీ మంత్రి ఫోన్‌ వాయిస్

కాగా ఇటీవల ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రోజూ ఏదో ఒక విషయంలో ఉభయసభలైన లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా పార్లమెంట్ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

ఇక ఈ సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలకు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ పార్లమెంట్ సమావేశాల వైపు ప్రజలు చూస్తున్నారు. ఇక ప్రతిపక్ష నాయకుల ట్రాప్ లో ఎవరూ పడొద్దని ప్రధాని సూచించినట్లు తెలుస్తుంది. ఎవరు తప్పు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారు. పార్లమెంట్ లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చెప్పండి. అలాగే ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తుంది.

First published:

Tags: Amit Shah, Bjp, India, Narendra modi

ఉత్తమ కథలు