హోమ్ /వార్తలు /national /

చంద్రబాబు ముఖ్య అనుచరుడిపై బీజేపీ వల.. ఆయన ఇచ్చిన సమాధానంతో మైండ్ బ్లాంక్

చంద్రబాబు ముఖ్య అనుచరుడిపై బీజేపీ వల.. ఆయన ఇచ్చిన సమాధానంతో మైండ్ బ్లాంక్

చంద్రబాబు (File)

చంద్రబాబు (File)

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు, గతంలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం ప్రభతగ్గిన వారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

  తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. చాపకింద నీరులా తమ పని కానిచ్చేస్తుంది. వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు, గతంలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం ప్రభతగ్గిన వారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డిపై బీజేపీ ఆపరేషన్ కమలాన్ని ప్రయోగించింది. బీజేపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి.. ‘తెలుగుదేశం పార్టీలో ఏముంది. మా దాంట్లోకి వచ్చేసెయ్. భవిష్యత్తు మాదే.’ అని మాట్లాడినట్టు తెలిసింది. అయితే, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి ఆయన మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారని సమాచారం. బీజేపీ నేత ఫోన్ చేయగా, ‘తెలంగాణలో మాకు ఎమ్మెల్యేలు లేరు. మీకు మాత్రం ఉన్నది ఒక్కరేగా. మీకు, మాకు పెద్ద తేడా ఏముందిలే..’ అని రావుల సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆ బీజేపీ నేత మౌనంగా ‘నీ ఇష్టం’ అని ఫోన్ పెట్టేసినట్టు సమాచారం.

  Telangana assembly elections2018|ttdp leader ravula chandrashekar reddy allegations on trs regards ec rule violations|ఈసీపై టీఆర్ఎస్ ఒత్తిడి.. ఎన్నికలు సజావుగా జరగనివ్వలేదు: టీటీడీపీ
  రావుల చంద్రశేఖర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

  తెలంగాణ టీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యనేత. చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడు. టీటీడీపీ తరఫున కొంచెం ప్రజలకు, మీడియాకు తెలిసిన ప్రముఖుడు. తెలంగాణలో టీడీపీ నుంచి నేతలు టీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిపోయినా ఆయన మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చంద్రబాబునాయుడితో ఉన్న ‘అనుబంధం’ వల్లే ఆయన టీడీపీతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bjp-tdp, Chandrababu Naidu, Telangana

  ఉత్తమ కథలు