హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Manish Sisodia : సిసోడియా సంచలన వ్యాఖ్యలు..ఆప్ ని చీల్చితే సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చింది!

Manish Sisodia : సిసోడియా సంచలన వ్యాఖ్యలు..ఆప్ ని చీల్చితే సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చింది!

మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)

మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)

 Manish Sisodia On BJP Offer : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారియి. ఆమ్ ఆద్మీ పార్టీని (AAP) చీలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవిని(CM Post) ఇస్తామని బీజేపీ(BJP) తనకు ఆఫర్ చేసిందని మనీష్ సిసోడియా సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Manish Sisodia On BJP Offer : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారియి. ఆమ్ ఆద్మీ పార్టీని (AAP) చీలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవిని(CM Post) ఇస్తామని బీజేపీ(BJP) తనకు ఆఫర్ చేసిందని మనీష్ సిసోడియా సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మనీష్ సిసోడియా అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "బీజేపీ నుంచి రెండు ఆఫర్లు ఉన్నాయన్న మెసేజ్ తో ఒకరు నా దగ్గరకు రావడంతో ఆశ్చర్యపోయాను. ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి బీజేపీలో చేరితే సీఎం పదవితో పాటు సీబీఐ(CBI), ఈడీ(ED)పెట్టిన కేసులన్నీ మూసేస్తామన్నారు. అయితే నేను మహారాణా ప్రతాప్​, రాజ్​పుత్​ వారసుడిని. తల నరక్కుంటాను కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి"అని సమాధానమిచ్చానని మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తన రాజకీయ గురువు అని, తాను ఆయన దగ్గరే రాజకీయాలు నేర్చుకున్నానని, సీఎం లేదా ప్రధాని కావడానికి తాను రాజకీయాల్లోకి రాలేదు అని సిసోడియా అన్నారు.

కాగా,ఢిల్లీ ఎక్సైజ్​ విధానంలో అవకతవకలకు సంబంధించి గత శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)మనీష్​ సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. సిసోడియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఎఫ్​ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ సోదాల నేపథ్యంలో ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ ప్రభుత్వానికి ఆదరణ పెరగడాన్ని ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని ఆప్‌ విమర్శించింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల్లో భయం పట్టుకుందని, కేజ్రీవాల్‌ ఉన్నతిని నిలువరించాలన్న కుట్రలో భాగంగానే సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయంటూ సిసోదియా విమర్శించారు.

Farmers Protest : ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ రైతుల ధర్నా..3కి.మీ మేర ట్రాఫిక్ జామ్

కేజ్రీవాల్​ ప్రభుత్వం గతేడాది నవంబర్​లో తీసుకొచ్చిన ఎక్సైజ్​ పాలసీ-2022(నూతన మద్యం విధానం) నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కొద్దిరోజుల కింద సీబీఐకి సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో జరిగిన నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మద్యం విధానంపై చీఫ్‌ సెక్రటరీ దాఖలు చేసిన నివేదికను చూస్తే జీఎన్‌సీటీడీ యాక్ట్‌ 1991, ట్రాన్సాక్షన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూల్స్‌, దిల్లీ ఎక్సైజ్‌ యాక్ట్‌-2009తోపాటు దిల్లీ ఎక్సైజ్‌ రూల్స్‌-2010ల నియమాలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని గవర్నర్ తెలిపారు. వీటితోపాటు టెండర్ల తర్వాత లైసెన్సుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.ఎల్​జీ సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గత నెలలో నూతన మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పాత మధ్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు పేర్కొంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: AAP, Arvind Kejriwal, Bjp, Delhi

ఉత్తమ కథలు