మిషన్-2024కు బీజేపీ(BJP) సన్నాహాలు వేగవంతం చేసింది. బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలకు(Lok Sabha Seats) పార్టీ వ్యూహం సిద్ధం చేసింది. ఈ సీట్ల సంఖ్య 160 కాగా అంతకుముందు 144గా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా ఉన్న సమయంలో ఆ పార్టీ ఓటమిని చవిచూడాల్సిన లోక్‌సభ స్థానాలు ఇవి. ఈ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ,(PM Narendra Modi) హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీగా ప్రచారం చేయనున్నారు. ఈ సీట్లను 40 విభిన్న క్లస్టర్లుగా విభజించారు. మూలాల ప్రకారం, ఈ క్లస్టర్లను కూడా పెంచవచ్చు. ఈ క్లస్టర్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం లేదా భారీ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. 144 సీట్లకు బదులు 160 సీట్లకు బీజేపీ సిద్ధమవుతోందని.. ఇందులో సగం సీట్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సగం సీట్లను హోంమంత్రి అమిత్ షా సందర్శించనున్నారు.
డిసెంబర్ 27 నుంచి నడ్డా సమావేశాలు ప్రారంభిస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరిలలో పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆయన బూత్ అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా డిసెంబర్ 28న పూరీ, కంద్‌మాల్‌లలో పర్యటించనున్నారు.
కుల సమీకరణాలు, ఆర్థిక, భౌగోళిక మరియు సామాజిక సమీకరణాల ప్రకారం క్లస్టర్ ఇన్‌చార్జి ఒక వ్యూహాన్ని రూపొందిస్తారని, తద్వారా ప్రతి తరగతిని దానితో అనుసంధానించవచ్చని వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు సంబంధిత నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారో కూడా ఈ ఇంచార్జి చూస్తారు. ఈ ఇంచార్జి ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలను కూడా నిర్వహిస్తారు.
Corona Nasal Vaccine: కరోనా రాకుండా ముక్కులో చుక్కల వ్యాక్సిన్ .. ఎలా పొందాలంటే..?
ఎప్పటికప్పుడు తమ పార్టీ ఇప్పటివరకు విజయం సాధించని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం, అక్కడ విజయం సాధించడం ఎలా అనే అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ చేస్తుంది. బీజేపీ బలంగా లేని పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగరేసింది. అదే తరహాలో తెలంగాణ , ఏపీ, తమిళనాడులోనూ పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ స్థానాలు కొన్ని కోల్పోవాల్సి వచ్చినా.. కొత్త ప్రాంతాల్లో సీట్లు గెలవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని బీజేపీ వ్యూహరచన చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, PM Narendra Modi