హోమ్ /వార్తలు /national /

AP BJP: బీజేపీ మీటింగ్‌కు ఆ ముగ్గురు ఎంపీలు డుమ్మా

AP BJP: బీజేపీ మీటింగ్‌కు ఆ ముగ్గురు ఎంపీలు డుమ్మా

తెలుగు రాష్ట్రాలకు మరోసారి మొండిచేయి

తెలుగు రాష్ట్రాలకు మరోసారి మొండిచేయి

కొన్ని నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్... విజయవాడలో జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టారు.

  విజయవాడలో జరిగిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశానికి ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్... ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోదర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కేంద్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.

  అయితే ఈ సమావేశానికి ముగ్గురు ఎంపీలు రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముగ్గురు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలే కావడంతో... వీరికి ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదేమో అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు ఏపీ బీజేపీలో కొంతకాలంపాటు క్రియాశీలకంగా వ్యవహరించిన ఎంపీ సుజనా చౌదరి... అమరావతి విషయంలో కేంద్రం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని... అయితే ఆయన ఈ భేటీకి దూరంగా ఉండిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ బీజేపీ సమావేశానికి ముగ్గురు ఎంపీలు ఎందుకు రాలేదనే దానిపై బీజేపీ నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Bjp, CM Ramesh, Sujana Chowdary, TG Venkatesh

  ఉత్తమ కథలు