హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BJP MP Grateful To Owaisi : మోదీ సర్కార్ కి ఝలక్..ఓవైసీకి బీజేపీ ఎంపీ కృతజ్ణతలు

BJP MP Grateful To Owaisi : మోదీ సర్కార్ కి ఝలక్..ఓవైసీకి బీజేపీ ఎంపీ కృతజ్ణతలు

అసదుద్దీన్ ఒవైసీ (File)

అసదుద్దీన్ ఒవైసీ (File)

BJP MP Grateful To Asaduddin Owaisi: కొద్ది నెలలుగా పలు సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(MP Varun Gandhi)తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వ్వవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరి ఘటన ఇలా ఆయా అంశాలపై మోదీ సర్కార్ ని వరుణ్‌ గాంధీ ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

BJP MP Grateful To Asaduddin Owaisi: కొద్ది నెలలుగా పలు సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(MP Varun Gandhi)తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వ్వవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరి ఘటన ఇలా ఆయా అంశాలపై మోదీ సర్కార్ ని వరుణ్‌ గాంధీ ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi)కి కృతజ్ఞతలు చెబుతూ మోదీ సర్కార్ కి ఝలక్ ఇచ్చారు వరుణ్ గాంధీ. ఇటీవల వరుణ్‌ గాంధీ లేవనెత్తిన నిరుద్యోగ అంశాన్ని అసదుద్దీన్ తన ప్రసంగంలో ప్రస్తావించడమే దీనికి కారణం. సోమవారం అసదుద్దీన్ ప్రసంగం వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన వరుణ్ గాంధీ.."ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అత్యంత తీవ్రమైన సమస్య. దేశవ్యాప్తంగా నేతలు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలి. అప్పుడే దేశం శక్తిమంతం అవుతుంది" అని ట్వీట్‌ లో పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌(UttarPradesh) రాష్ట్రంలో నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్‌ గాంధీ ఇటీవల దేశంలోని నిరుద్యోగ సమస్యను ఆయన లేవనెత్తారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వివరిస్తూ ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడికి పోయిందంటూ వరుణ్ గాంధీ ఇటీవల ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటనలు రాకపోవడంతో కోట్లాది మంది యువత తీవ్ర నిరాశలో ఉన్నారని విమర్శించారు.ఏడు జన్మలా,ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు. వ్రతం చేసిన భార్యబాధితులు

ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉండగా, మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటాన్ని విమర్శించారు. అయితే తాజాగా వరుణగాంధీ బయటపెట్టిన గణాంకాలనే ఒవైసీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఓ సభలో మాట్లాడుతూ పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను చెబుతూ... ఇది తన డేటా కాదని, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ పేర్కొన్న సమాచారమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అసద్దుద్దీన్‌ ఒవైసీకి ధన్యవాదాలు చెబుతూ సోమవారం ఓ ట్వీట్ లో ధన్యవాదాలు తెలిపారు వరుణ్ గాంధీ.

First published:

Tags: Asaduddin Owaisi, Bjp, JOBS

ఉత్తమ కథలు