హోమ్ /వార్తలు /national /

బీజేపీ ఎంపీకి బిగ్ షాక్ ఇచ్చిన రాష్ట్రపతి...

బీజేపీ ఎంపీకి బిగ్ షాక్ ఇచ్చిన రాష్ట్రపతి...

సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖను కోరిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.

  బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఊహించని షాక్ తగిలింది. సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదును పరిశీలించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర హోంశాఖను ఆదేశించారు. సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో రీ-డైరెక్ట్‌ కావడంతో... ఆ లేఖను సంబంధిత శాఖలకు పంపిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.

  హోంశాఖ విడుదల చేసిన మెమొరండం

  సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రపతి నుంచి విజయసాయి రెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది. దీంతో సుజనా చౌదరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

  First published:

  Tags: Bjp, Sujana Chowdary, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు