హోమ్ /వార్తలు /national /

విజయ సాయిరెడ్డికి సుజనా కౌంటర్.. ఆ లేఖపై వివరణ

విజయ సాయిరెడ్డికి సుజనా కౌంటర్.. ఆ లేఖపై వివరణ

వారం వారం కోర్టు మెట్లెక్కే విజయసాయిరెడ్డి.. ఇకనైనా ఇలాంటి నేలబారు వ్యవహారాలు కట్టిపెట్టి రాష్ట్రానికి ప్రయోజనకారిగా వుండే అంశాలపై దృష్టి పెట్టడం మంచిదని హితవు పలికారు సుజనా చౌదరి.

  రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై దుమారం రేగుతోంది. ఆ లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్రహోంశాఖకు ఫార్వార్డ్ చేశారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారంపై సుజనా చౌదరి స్వయంగా స్పందించారు. దేశంలో ఏ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాసినా.. రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వశాఖకు ఫార్వార్డ్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయసాయిరెడ్డి రాసిన లేఖ కూడా హోంమంత్రిత్వశాఖకు చేరిందని చెప్పుకొచ్చారు. తన రాజకీయ, వ్యాపార జీవితం తెరిచిన పుస్తకమని.. రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎక్నాలెడ్జ్ మెంట్‌ను పట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చడానికి విజయసాయిరెడ్డి చిల్లర ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సుజనా.

  ''16 నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టిన శ్రీ విజయసాయిరెడ్డి నాపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ సెప్టెంబరు 26న రాష్ట్రపతికి లేఖరాశారు. ఆ లేఖని రాష్ట్రపతి కార్యాలయం దాదాపు నెలన్నర తరువాత నవంబరు 6న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫార్వార్డ్ చేసింది. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతిగారికి లేఖ రాసినా, అర్జీ పెట్టుకున్నా రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వ శాఖకు దాన్ని ఫార్వార్డ్ చేయడం రివాజు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాష్ట్రపతిగారికి నామీద అభూతకల్పనలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాసిన ఉత్తరం కూడా హోం మంత్రిత్వ శాఖకు చేరింది.'' అని సుజనా చౌదరి పేర్కొన్నారు.

  వారం వారం కోర్టు మెట్లెక్కే విజయసాయిరెడ్డి.. ఇకనైనా ఇలాంటి నేలబారు వ్యవహారాలు కట్టిపెట్టి రాష్ట్రానికి ప్రయోజనకారిగా వుండే అంశాలపై దృష్టి పెట్టడం మంచిదని హితవు పలికారు సుజనా చౌదరి.

  కాగా, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. దీనిపై రాష్ట్రపతి నుంచి విజయసాయి రెడ్డికి బదులిస్తూ .. ఆ లేఖను హోంమంత్రిత్వశాఖకు రాష్ట్రపతి కార్యాలయం బదిలీ చేసింది.

  ఇది కూడా చూడండి :

  First published:

  Tags: AP News, Bjp, Sujana Chowdary, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు