హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బీజేపీ ఎంపీకి డాన్స్ మాత్రమే వచ్చు... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్య

బీజేపీ ఎంపీకి డాన్స్ మాత్రమే వచ్చు... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్య

ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్... బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు.

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్... బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. అంతటితో ఆగని కేజ్రీవాల్... మీ ఎంపికి పని చేయడం రాదని... కేవలం డాన్స్ చేయడం మాత్రమే వస్తుందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దిలీప్ పాండేకు డాన్స్ చేయడం రాదన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఆయనకు పని చేయడం మాత్రమే వస్తుందని అన్నారు.

    ఈ ఎన్నికల్లో ఎంతో కీలకమన్న కేజ్రీవాల్... ప్రజలు పేరు చూసి కాకుండా వారి పనితీరును బట్టి ఓటు వేయాలని కోరారు. తనపై ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మనోజ్ తివారీ... ఆయన వ్యాఖ్యలు పూర్వాంచల్ ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. వారే ఆయనకు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. ఆరో విడతలో భాగంగా మే 12న జరగబోయే ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తుండగా... ఆప్ నుంచి దిలీప్ పాండే బరిలో ఉండగా, కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పోటీ చేస్తున్నారు.

    First published:

    Tags: AAP, Arvind Kejriwal, Bjp, Congress

    ఉత్తమ కథలు