హోమ్ /వార్తలు /national /

టీడీపీది విశ్వాస ఘాతుకం!..: గోకరాజు రంగరాజు

టీడీపీది విశ్వాస ఘాతుకం!..: గోకరాజు రంగరాజు

ఎంపీ గోకరాజు రంగరాజు, సీఎం చంద్రబాబు..

ఎంపీ గోకరాజు రంగరాజు, సీఎం చంద్రబాబు..

విభజన సమయానికి అనేక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. నేడు అభివృద్ది బాటలో పయనిస్తుందంటే బీజేపీయే కారణమని ఎంపీ గోకరాజు రంగరాజు చెప్పారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు సమర్థత లేదని తాము అనడం లేదని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది ఎవరి వల్ల సాధ్యపడిందో ఆయన చెప్పి ఉంటే బాగుండేదని బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు అన్నారు. ఒకరిపై విమర్శలు చేయడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగలేమని గుర్తుచేశారు. మాటల యుద్దాన్ని పక్కనపెట్టి.. తాను మోదీ కన్నా గొప్పవాడినని చంద్రబాబు చేతల్లో నిరూపించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి పొందిన సహాయాన్ని మరిచిపోయి.. పొద్దున లేచింది మొదలు బీజేపీపై టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించడం సబబు కాదన్నారు.టీడీపీ చేస్తున్నది విశ్వాస ఘాతకమన్నారు.

రాష్ట్ర అభివృద్దిలో కేంద్రం పాత్ర ఉందని టీడీపీకి చెప్పి ఉంటే.. తమ పార్టీతో వచ్చే ఎన్నికల దాకా స్నేహబంధం కొనసాగి ఉంటే రాష్ట్రానికి మరింత మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఉపాధి హామి కింద కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తిగా ఉపయోగించుకున్న రాష్ట్రం ఏపీనే అన్నారు. రాష్ట్ర విభజన నాటికి.. ఏపీ అనేక సమస్యలతో ఇబ్బందుల్లో ఉందని గుర్తుచేశారు. బీజేపీ సహాయం వల్ల నేడు రాష్ట్రంలో ఇంత అభివృద్ధి సాధ్యపడిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కట్టుబట్టలతో వచ్చేశామని చెబుతున్న చంద్రబాబుకు.. అభివృద్ధి పథకాలకు నిధులు ఎక్కడినుంచి వచ్చాయో తెలియదా? అని ప్రశ్నించారు. ఇదంతా మోదీ అందించిన సహకారం వల్లే సాధ్యపడిందని, ఆ విషయాన్ని మరిచిపోకూడదని గుర్తుచేశారు.

First published:

Tags: Andhra Pradesh, Bjp, Bjp-tdp, Chandrababu naidu

ఉత్తమ కథలు