POLITICS BJP MP ARJUN SINGH RETURNS TO TRINAMOOL CONGRESS PVN
Big hock To BJP In Bengal: బెంగాల్ లో బీజేపీకి బిగ్ షాక్!
టిఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్
BJP MP Joins TMC : వెస్ట్ బెంగాల్(West Bengal)రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. . ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పారు.
BJP MP Joins TMC : వెస్ట్ బెంగాల్(West Bengal)రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. . ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా బెంగాల్ బీజేపీ(BJP) ఉపాధ్యక్షుడు, ఎంపీ అర్జున్‌సింగ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు తన కుమారుడు పవన్ సింగ్ తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో చేరారు. పవన్ సింగ్.. భట్పరా నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టిఎంసీలో చేరడానికి ముందు ఎంపీ అర్జున్ సింగ్... మంత్రి జ్యోతిప్రియో మల్లిక్, ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి కామెక్ స్ట్రీట్‌లోని టీఎంసీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
కొన్ని రోజులుగా అర్జున్ సింగ్..బీజేపీ పార్టీని సరిగ్గా పనిచేయనివ్వడం లేదని రాష్ట్ర నాయకత్వంపై విరుచుకుపడ్డారు. జనపనార ధరలను క్వింటాల్‌కు రూ.6,500కు పెంచుతూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడంపై అర్జున్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖలో వర్గపోరుకు సంబంధించి బీజేపీ ఉన్నతాధికారులను కలవడానికి అర్జున్ సింగ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లినట్లు కూడా సమాచారం. ఈ సందర్భంగా ఆయన జూట్ మిల్లు అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ అసంతృప్తి నడుమ ఎంపీ అర్జున్ సింగ్ గత ఆరు నెలలుగా తృణమూల్ కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు. ఆయనను ఒప్పించేందుకు బీజేపీ పలుమార్లు విఫలయత్నాలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అర్జున్ సింగ్ తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరారు. బరాక్‌పూర్ స్థానం నుంచి దినేష్ త్రివేదికి టీఎంసీ టిక్కెట్ ఇవ్వడంతో అర్జున్ సింగ్ తృణమూల్‌ను వీడారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన త్రివేదిపై అర్జున్ సింగ్ గెలుపొందారు. దాదాపు మూడేండ్ల తర్వాత తిరిగి సొంతగూటికి చేరారు. 2001 నుంచి 2019 వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యునిగా ఉన్న సమయంలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా అర్జున్ సింగ్ ఉండేవారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.