హోమ్ /వార్తలు /national /

తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే వర్సెస్ కేంద్రమంత్రి ?

తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే వర్సెస్ కేంద్రమంత్రి ?

బీజేపీ జెండా

బీజేపీ జెండా

తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయి. పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ? ఈ ప్రశ్నకు రాజకీయవర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తే... ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బండారు దత్తాత్రేయ ఈ విషయంలో ప్రోటోకాల్ పాటించేవారని ఆయన అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు బీజేపీ పెద్ద నేతలు కొందరు ప్రయత్నించారని... కానీ కార్యకర్తలు ప్రాణం పెట్టి తనను గెలిపించారని ఆయన అన్నారు.

  తనకు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణే ముఖ్యమని మరోసారి స్పష్టం చేసిన రాజాసింగ్... తనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై ఆసక్తి లేదని... బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ ఈ పదవికి సరైన వారని రాజా సింగ్ అన్నారు. మొత్తానికి ఉన్నట్టుండి రాజాసింగ్ సొంత పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేయడంతో... తెలంగాణ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Kishan Reddy, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు