హోమ్ /వార్తలు /national /

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు

రాజాసింగ్

రాజాసింగ్

ఇప్పటికీ తన పేరును రౌడీ షీటర్స్ జాబితాలో కొనసాగిస్తున్నారని.. ఇదీ తెలంగాణ పోలీసుల అసలు నైజమని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు రాజాసింగ్.

  బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో రాజాసింగ్ కూడా ఉన్నారు. రౌడీ షీటర్స్ లిస్టులో ఆయన పేరును చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తన పేరును రౌడీ షీటర్స్ జాబితాలో కొనసాగిస్తున్నారని.. ఇదీ తెలంగాణ పోలీసుల అసలు నైజమని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు రాజాసింగ్.

  ''నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నాపై రౌడీ షీట్ తీయలేదు. తెలంగాణ పోలీసుల దృష్టిలో నేను ఎమ్మెల్యేను కాదు. రౌడీ షీటర్‌నే. ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గతంలో రౌడీ షీట్‌లు ఉండేవి. వారి పేర్లు రౌడీ షీట్‌లో పెట్టే దమ్ము పోలీసులకు ఉందా? దీనిపై కేసీఆర్, హోంమంత్రి సమాధానం చెప్పాలి.'' అని రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు స్టేషన్‌లో సుమారు 45 కేసులు నమోదయ్యాయి. వాటిలో రెచ్చగొట్టే ప్రసంగాలు, మత సామరస్యాన్ని చెడగొట్టడం వంటి కేసులే ఎక్కువగా ఉన్నాయి.

  రౌడీ షీటర్ల జాబితాలో రాజా సింగ్ పేరు

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Hyderabad, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు