హోమ్ /వార్తలు /national /

హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

రాజాసింగ్ (File)

రాజాసింగ్ (File)

తెలంగాణ నూతన సెక్రటేరియెట్, అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. మొత్తం 16 ఎకరాల స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సచివాలయం కోసం దాదాపు రూ.100కోట్లు ఖర్చుచేస్తున్నారు.

  తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై రాజకీయ రగడ నెలకొంది. వందల కోట్ల ప్రజధనాన్ని కేసీఆర్ వృథా చేస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో బీజేపీ నేతలు సచివాలయ ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి సెక్రటేరియెట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు రాజాసింగ్ సహా పలువురు నేతలను అరెస్ట్‌చేసి ముషీరాబాద్‌కు తరలించారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల తీరుపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

  రూ.600 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ వృథా చేస్తున్నారు. వాస్తు దోషం పేరుతో సెక్రటేరియెట్, అసెంబ్లీ భవనాలను కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. పేదల కోసం రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నారు. కానీ 20వేల ఇళ్లు కూడా కట్టలేదు. సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఖర్చుచేసే డబ్బుతో పేదలకు ఇళ్లు కట్టించాలి.
  రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే

  హబ్సిగూడలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, తెలంగాణ నూతన సెక్రటేరియెట్, అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. మొత్తం 16 ఎకరాల స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సచివాలయం కోసం దాదాపు రూ.100కోట్లు ఖర్చుచేస్తున్నారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయనున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, CM KCR, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు