హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రూ. 2కే కిలో పిండి, ఉచితంగా స్కూటర్లు... ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టోలో వరాలు

రూ. 2కే కిలో పిండి, ఉచితంగా స్కూటర్లు... ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టోలో వరాలు

ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేతలు

ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేతలు

తాము అధికారంలో వస్తే ఢిల్లీ వాసులకు రూ. 2 రూపాయలకే కిలో గోధుమ పిండి అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.

  ప్రజలను ఆకట్టుకోవాలంటే జనాకర్షక పథకాలు తప్పదని అనుకున్నారో లేక కేజ్రీవాల్‌తో పోటీ పడాలంటే ఆయన మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ... బీజేపీ కూడా ఢిల్లీలో ఓటర్లను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలను తమ మేనిఫెస్టో ద్వారా ప్రకటించింది. ఢిల్లీ వాసులకు రెండు రూపాయలకే కిలో గోధుమ పిండి అందిస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఆర్థిక వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిలు కాలేజీకి వెళ్లినట్టయితే వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లోని అమ్మాయిల పెళ్లికి రూ. 51 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది.

  ఢిల్లీలో అమ్మాయి పుట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంక్ ఖాతా తెరుస్తుందని... ఆ అమ్మాయికి 21 ఏళ్లు రాగానే అకౌంట్‌లో రూ. 2 లక్షలు వేస్తామని పేర్కొంది. ఆయుష్మాన్ యోజనను ఢిల్లీలో అమలు చేస్తామని వివరించింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చింది. వ్యాపారులకు ఇబ్బందిగా మారిన సీలింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని... అద్దె ఇంట్లో ఉంటున్న వారికి చేయూత అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఢిల్లీలో కొత్త కాలేజీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం మరింత శ్రద్ధ పెడతామని ప్రకటించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: AAP, Bjp, Delhi Assembly Election 2020

  ఉత్తమ కథలు