Home /News /national /

POLITICS BJP LEADERS SHARE VIDEO OF RAHUL GANDHI IN KATHMANDUS FAMOUS PUB PAH

Rahul Gandhi: పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న వీడియో..

నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ

నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ

Congress leader: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, తన స్నేహితులతో కలిసి నైట్ క్లబ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rahul Gandhi in Kathmandus Famous Pub:  కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖాట్మాండులోని ఫెమస్ క్లబ్ లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా షేర్ చేశారు. దీంతో ఇది వెంటనే వైరల్ గా మారిపోయింది. నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.





ప్రధాని దేశం కోసం, పర్యటనలు చేస్తున్నారని.. మరీ రాహుల్ గాంధీ పబ్ లో ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియోలో.. ఖాట్మాండు లో ఉన్న నైట్ క్లబ్ రాహుల్ అర్దరాత్రి తన మిత్రులతో కలసి ఎంజాయ్ చేస్తున్నారు. క్లబ్ అంతా మసక మసకగా ఉంది. అదే విధంగా అక్కడ జోరుగా, డీజే పాటలు విన్పిస్తున్నాయి. డ్యాన్స్ లు కూడా చేస్తున్నారు. దీనిపై బీజేపీ ఐటీ కన్వీనర్ అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో స్పందించారు.. “ముంబై ముట్టడిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌లో ఉన్నారని తెలిపారు. వీరికి  పబ్ లలో  పాల్గొనడం, వేరే వారిపైన విమర్శలు చేయడం మాత్రమే తెలుసని అన్నారు.

ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. రాహుల్ నేపాల్ లో తన దగ్గరి ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేందుకు నేపాల్ వెళ్లారని తెలిపారు. రాహుల్ఆ గాంధీ  పక్కన ఉన్న మహిళ చైనా దేశానికి చెందిన రాయబారి అని సమాచారం. వీరు జర్నలిస్టు  సుమ్నిమా దాస్ పెళ్లికి  హజరయ్యేందుకు  వెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పబ్ లకు వెళితే తప్పేంటని కాంగ్రెస్ వాదిస్తుంది. అయితే, దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్ లు చేస్తున్నారు. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ టూర్ లకు వెళ్లటం కొత్తేమి కాదంటూ కామెంట్ లు చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Congress, Rahul Gandhi, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు