హోమ్ /వార్తలు /national /

Kodali Nani: చంద్రబాబులా కొడాలి నాని.. మండిపడ్డ బీజేపీ

Kodali Nani: చంద్రబాబులా కొడాలి నాని.. మండిపడ్డ బీజేపీ

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

BJP Comments on Kodali Nani: అహంకారంతో దేవుళ్లను, అత్యంత పవిత్ర హిందువులయిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దూషించిన కొడాలి నాని కలియుగ శిశుపాలుడు అని బీజేపీ మండిపడింది.

  సీఎం జగన్ తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని తీరును బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కొడాలి నాని అహంకారంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అహంకారంతో దేవుళ్లను, అత్యంత పవిత్ర హిందువులయిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దూషించిన కొడాలి నాని కలియుగ శిశుపాలుడు అని మండిపడ్డారు. వంద సార్లు మోదీని దూషించే దాకా ఆగి నారా చంద్రబాబు లాగా తమ పతనాన్ని కోరి తెచుకుంటారో లేక వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి సీఎం జగన్ తమ తప్పును గుర్తిస్తారో చూడాల్సి వుందని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.

  GVL Narasimha Rao, GVL Letter to YS Jagan, Lepakshi Temple, Basavanna, బసవన్న, వీరభద్రస్వామి, జీవీఎల్ లేఖ, జగన్
  జీవీఎల్ నరసింహారావు

  కొడాలి నాని జగన్ మత్తులో వున్నారని, మెప్పుపొందేందుకు కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌లపై మంత్రి కొడాలి నాని అనుచితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. కొడాలి నాని వేరొక మతం పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే సీఎం జగన్ ఊరుకునేవారా అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నానిపై సీఎం జగన్ చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఉద్యమిస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

  Kodali nani news, tdp news, ap news, ap politics, kodali nani in Tirumala, తిరుమలలో కొడాలి నాని, టీడీపీ న్యూస్, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, తిరుమలలో కొడాలి నాని
  ఏపీ మంత్రి కొడాలి నాని(ఫైల్ ఫోటో)

  బీజేపీకి టార్గెట్‌గా మారిన కొడాలి

  మంత్రి కొడాలి నాని అంటే వైసీపీ తరపున టీడీపీని విమర్శించే నేతగా గుర్తింపు ఉంది. చంద్రబాబును, నారా లోకేశ్‌ తీవ్రంగా విమర్శించే వారిలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. అయితే అలాంటి కొడాలి నాని ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు కొడాలి నానిపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి బీజేపీ కూడా తోడైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న టీడీపీకి, ఆయన ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం కలిసొచ్చినట్టయ్యింది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మంత్రి కొడాలి నాని టీడీపీతో పాటు బీజేపీకి కూడా టార్గెట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

  అయితే సీఎం జగన్ తిరుమల డిక్లరేషన్ వివాదం ముగిసిపోవడంతో.. కొడాలి నాని కూడా ఈ అంశంపై పెద్దగా స్పందించే అవకాశం లేదనే వాళ్లు ఉన్నారు. అలాంటప్పుడు ఆయన మళ్లీ బీజేపీని విమర్శించే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ నేతలు కొడాలి నానిపై విమర్శలు మరింత తీవ్రతరం చేస్తే ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని వివరణ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది. మొత్తానికి టీడీపీని విమర్శించే క్రమంలో బీజేపీ కామెంట్స్‌పై తనదైన శైలిలో స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఆ పార్టీకి అనుకోని విధంగా టార్గెట్ అయ్యారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Bjp, Kodali Nani

  ఉత్తమ కథలు