హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kailash Vijayvargiya : బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలపై విపక్షాలు పైర్

Kailash Vijayvargiya : బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలపై విపక్షాలు పైర్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ

Agniveers get security jobs at BJP offices :  భారత త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెట్ (Agnnipath Scheme) పథకంపై దేశ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ...అగ్నివీరులకు(Agniveers)బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya)చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఇంకా చదవండి ...

Agniveers get security jobs at BJP offices :  భారత త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెట్ (Agnnipath Scheme) పథకంపై దేశ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ...అగ్నివీరులకు(Agniveers)బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya)చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కైలాశ్‌ విజయవర్గీయ.. సైనికులను అవమానించారని కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన తదితర పార్టీలు మండిపడ్డాయి. అగ్నివీర్​లను ఉద్దేశించి కైలాశ్‌ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఖండించారు.

అగ్నిపథ్ స్కీమ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువత, విపక్ష పార్టీలు డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ దీనిపై మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ(BJP)కార్యాలయాల్లో భద్రతా సిబ్బందిగా(Security Guard)అగ్నివీర్​లకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని కైలాశ్​ విజయవర్గీయ అన్నారు. కైలాశ్​ విజయవర్గీయ మాట్లాడుతూ..."ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి నిష్క్రమించినప్పుడు అతను ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ కింద రూ. 11 లక్షలు అందుకుంటాడు మరియు అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. నేను బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే అగ్నివీర్‌కు ప్రాధాన్యత ఇస్తాను"అని తెలిపారు. కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కైలాష్ విజయవర్గీయ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో విపక్షాలైన కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన తదితర పార్టీలు బీజేపీపై మండిపడ్డాయి.

See Pics : కూతురు పెళ్లికి చనిపోయిన తండ్రి..కన్నీళ్లు పెట్టించే సంఘటన

అగ్నివీర్​లను బీజేపీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ గార్డుగా నియమిస్తామనడం దారుణమని కాంగ్రెస్ విరుచుకుపడింది. కైలాష్ విజయవర్గీయ మాటలతో అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఓ ట్వీట్ లో..."సైనికులను భాజపా ప్రధాన కార్యదర్శి అవమానించారు. అగ్నివీర్ సైనికులు బీజేపీ కార్యాలయం వెలుపల భద్రతా సిబ్బంది అవుతారని అంటున్నారు. ఇది సిగ్గులేని ప్రభుత్వం. అందుకే అగ్నిపథ్ పథకాన్ని వద్దని అంటున్నాం మోదీజీ" అని పేర్కొంది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఓ ట్వీట్ లో..."అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందుకు కూడా మన ఆర్మీ శిక్షణ ఇస్తుంది. యూనిఫాంలో ఉన్న వారి ప్రాముఖ్యతను చిన్నచూపు చూస్తున్నారు" అని ఫైర్ అయ్యారు. అయితే టూల్​కిట్​ గ్యాంగ్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని కైలాశ్ విజయవర్గీయ అన్నారు.

Video : సైకిల్ తొక్కుతూ కిందపడిపోయిన అమెరికా అధ్యక్షుడు

దేశ యువత, ఆర్మీని అగౌరవపర్చవద్దని ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ట్విట్టర్‌లో విమర్శించారు. కేజ్రీవాల్ తన ట్వీట్ లో.."దేశంలోని యువతను, ఆర్మీ సిబ్బందిని అంతగా అగౌరవపరచవద్దు. మన దేశంలోని యువత భౌతికంగా ఉత్తీర్ణత సాధించడానికి, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పగలు మరియు రాత్రి కష్టపడతారు, ఎందుకంటే వారు సైన్యంలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు, బీజేపీ కార్యాలయం వెలుపల కాపలాగా ఉండటానికి కాదు"అని పేర్కొన్నారు.


Viral Video : క్లాస్ రూమ్ లో డ్యాన్స్ ఇరగదీసిన యంగ్ టీచర్..సోషల్ మీడియా షేక్

మరోవైపు,అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో (Central Armed Police Forces) రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ కార్యాలయం (Home Ministry) శనివారం ప్రకటించింది. 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ (Agniveer) తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Explainers: అగ్నిపథ్ స్కీమ్‌పై ఎందుకంత వ్యతిరేకత..? భయాలు, అపోహలు, కేంద్రం వైఖరిపై న్యూస్‌18 వివరణ..

కేంద్ర సాయుధ పోలీసు బలగాలంటే.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. అగ్నిపథ్ స్కీమ్ కింద ఎంపికై.. నాలుగేళ్లు ఈ త్రివిధ దళాల్లో పనిచేసిన వారికి.. కేంద్ర సాయుధ బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే ఈ విభాగాల్లో 10 శాతం పోస్టులను అగ్నివీరులకు కేటాయిస్తారు. గరిష్ట వయో పరిమితిని మూడేళ్లు సడలిస్తారు. ఇక తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల పాటు సడలింపు ఉంటుంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Agnipath Protest, Agnipath Scheme, Bjp

ఉత్తమ కథలు