హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BJP vs AAP: తీహార్ జైల్లో మంత్రి మసాజ్‌ వీడియో వైరల్ .. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్న ఆప్

BJP vs AAP: తీహార్ జైల్లో మంత్రి మసాజ్‌ వీడియో వైరల్ .. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్న ఆప్

aap vs bjp(Photo:Twitter)

aap vs bjp(Photo:Twitter)

BJP vs AAP: త్వరలో జరగబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కోసమే బీజేపీ సత్యేంద్ర జైన్‌ ఫిజియోథెరపీ చేయించుకుంటున్న వీడియోని అడ్డుపెట్టుకొని చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి వీడియోని బయటపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై వివరణ ఇచ్చారు ఆప్ నేతలు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఢిల్లీ(Delhi)రాష్ట్ర మంత్రి, ఆప్‌ నేత సత్యేంద్ర జైన్‌ Satyendra Jainమనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయనకు జైల్లో పొందుతున్న సేవలకు సంబంధించిన వీడియో (Video)ఇప్పుడు బయటకు రావడంతో బీజేపీ(BJP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆర్దిక నేరం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి మసాజ్‌(Massage)చేస్తూ ..కాళ్లు నొక్కిస్తారా అంటూ జైల్ అధికారుల తీరును తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వీడియోని వైరల్(Viral) కావడంతో ఆప్ నేతలు తీహార్ జైల్లో(Tihar Jail)మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారంటూ విమర్శలు చేశారు కమలనాథులు. బీజేపీ విమర్శలతో పాటు వైరల్ అవుతున్న మసాజ్‌ వీడియోపై ఆప్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా(Manish Sisodia)వివరణ ఇచ్చారు.

Delhi | Viral news: లివింగ్ రిలేషన్ వల్లే శ్రద్దా వాకర్ హత్య ..కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యలపై శివసేన ఫైర్

మాజీ మంత్రికి జైల్లో మసాజ్..

ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్‌ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న విషయం అందరికి తెలుసు. ఆ కేసులోనే ఆయన తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న ఆయనకు ఎలాంటి సౌకర్యాలు, మర్యాదలు జరుగుతున్నాయో కళ్లకు కట్టి చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌కు మసాజ్ చేయించుకున్న విజువల్స్ బయటకు రావడంతో బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడుతున్నారు. తీహార్‌ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ మసాజ్ పార్లర్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోందని విమర్శలు చేశారు.

మసాజ్‌ కాదు ఫిజియోథెరపీ అంటున్న ఆప్ ..

తీహార్ జైల్లో మంత్రి సత్యేంద్ర జైన్‌కి సేవలు, మసాజ్‌ చేస్తున్న వీడియో సెప్టెంబర్‌ నెలదని..జైల్ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. అప్పటికి ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేదని మంత్రిగా కొనసాగుతూనే ఉన్నట్లుగా సమర్ధించుకున్నారు. వైరల్ అవుతున్న వీడియో, బీజేపీ నేతల విమర్శలపై ఆప్ నేత మనీష్‌ సిసోడియా ఖండించారు. సత్యేంద్రజైన్‌కి రెండు సర్జరీలు చేయించుకున్నందునా ఆయనకు జైల్లో వీవీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నారని పేర్కొన్నారు. అంతే కాదు జైల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న నేతను అపహాస్యం చేసేలా మాట్లాడటం సరికాదన్నారు మనీష్‌ సిసోడియా. ఫిజియోథెరపీ చేయించుకుంటున్న వీడియోని పట్టుకొని మసాజ్‌ సెంటర్ వీడియో అని బీజేపీ రిలీజ్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని మండిపడ్డారు.

చీప్ ట్రిక్స్ అంటున్న సిసోడియా..

త్వరలో జరగబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కోసమే ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి వీడియోని బయటపెట్టి లబ్ది పొందాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతల తీరును తిప్పి కొడుతున్నారు ఆప్ నేతలు.

First published:

Tags: AAP, Bjp, National News, Viral Video

ఉత్తమ కథలు