హోమ్ /వార్తలు /national /

Telangana BJP: ప్రజారోగ్యాన్ని సీఎం గాలికి వదిలేశారు.. కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం దాస్తుంది..

Telangana BJP: ప్రజారోగ్యాన్ని సీఎం గాలికి వదిలేశారు.. కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం దాస్తుంది..

తెలంగాణ బీజేపీ నాయకులు

తెలంగాణ బీజేపీ నాయకులు

Telangana BJP: రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్ తో రేపు జరగబోతున్న గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష ను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు, లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతునే ఇండ్లలోనే ఉ.10 నుంచి మ.1 గం. వరకు నిరసన దీక్ష చేపట్టాలని కోరారు.

ఇంకా చదవండి ...

    రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణలేదన్నారు. పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందన్నారు. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయింది. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్ తో రేపు జరగబోతున్న “ గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

    కరోనా బారిన పడి రాష్ట్రంలో ప్రజలు వేలల్లో చనిపోతున్నారని బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ అన్నారు. లక్షల మంది కరోనా బాధిత కుటుంబాలు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని.. కరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్, రెమ్‌డెసివిర్, వెంటిలేటర్లను భారీగా అందజేసిందన్నారు.

    రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్ తో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఇళ్లలోనే చేసే గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు, లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతునే ఇండ్లలోనే ఉ.10 నుంచి మ.1 గం. వరకు నిరసన దీక్ష జరుగుతుంది. మీడియా, సోషల్ మీడియా, వర్చువల్ మీడియా ద్వారా దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పేర్కొన్నారు.

    Published by:Veera Babu
    First published:

    Tags: Bjp-janasena, DK Aruna, Vijayashanthi

    ఉత్తమ కథలు