హైదరాబాద్ (Hyderabad)ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటక(Karnataka)లోని బీజాపూర్(Bijapur)మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్ ... దేశానికి హిజాబ్(Hijab) ధరించిన మహిళ ప్రధాని కావాలన్నదే తమ కోరిక చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది. మజ్లీస్ పార్టీ ఎంపీ చేసిన కామెంట్స్‌కి బీజేపీ(BJP)నేతలు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. దేశం సంగతి పక్కన పెట్టి ముందు ఎంఐఎం పార్టీకి హిజాబ్ ధరించిన మహిళ అధ్యక్షురాలిగా ఎప్పుడు ఉంటుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కర్నాటక పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళను చూడాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన అసదుద్దీన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. అక్కడ కార్పొరేషన్‌లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది. వారి తరపున మంగళవారం ప్రచారం చేసిన అసదుద్దీన్ రోడ్ షోలో పాల్గొన్నారు. అటుపై హిజాబ్ గురించి ప్రస్తావించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
.@BJP4India aur @RSSorg ka kahna hai 'Bangladesh se log Bharat aakar dharm-parivartan karakar jansankhya asantulan kar rahe hain' yeh kahkar wo Border Security Forces ko kamzor kar rahe hain. - Barrister @asadowaisi pic.twitter.com/emV0a5atm3
— AIMIM (@aimim_national) October 26, 2022
బీజేపీ కౌంటర్ ..
అసదుద్దీన్ చేసిన కామెంట్స్‌కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కమలం నేతలు. దేశ ప్రధాని స్థానంలో కాదు ఎంఐఎం అధినేతగా హిజాబ్ ధరించిన మహిళ ఎప్పుడు ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాబ్ పునావాలా ఓవైసీని రివర్స్ ప్రశ్నించారు. ఎంఐఎం విమర్శించడం..దానికి బీజేపీ కౌంటర్ ఇవ్వడం కామన్‌గా జరిగే విషయమే అయినప్పటికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా దేశ రాజకీయాల ప్రస్తావన తేవడం ఎంఐఎం రాజకీయ దుర్బుద్దికి నిదర్శనమని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
28న ఎన్నికలు..
ఎంఐఎం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరింపజేస్తామని గతంలోనే ప్రకటించింది ఎంఐఎం పార్టీ. అందులో భాగంగానే తమకు బలం ఉన్న ప్రతిచోట, ముస్లిం ఓటింగ్ బాగా ప్రభావితం చేసే ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కర్నాటక బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా నాలుగు వార్డుల్లో అభ్యర్ధులను నిలబెట్టింది. వారి విజయం కోసం ఏకంగా అసదుద్దీన్ ప్రచారానికి వచ్చారు. అయితే ఈనెల 28నబీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, National News