Home /News /national /

POLITICS BJP BIG PLAN TO TARGET UDDHAV THACKREY SHIV SENA WITH EKNATH SHINDE AS CHIEF MINISTER OF MAHARASHTRA AK

Maharashtra| BJP: మహారాష్ట్రలో మరోసారి టార్గెట్ ఉద్ధవ్ థాక్రే.. బీజేపీ సరికొత్త ప్లాన్.. అందుకే చివరి నిమిషంలో..

ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్

ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్

BJP Maharashtra Plan: సాధారణంగా బీజేపీ వ్యూహాలు మిగతా పార్టీలకు కాస్త భిన్నంగా ఉంటాయి. తాము బలపడటం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థులు బలహీనపడేలా చేయడం కూడా అంతే ముఖ్యం అనే స్ట్రాటజీని బీజేపీ ఫాలో అవుతుంటుంది.

    మహారాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. సీఎంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో ఇక బీజేపీ తరపున మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫడ్నవీస్ శిబిరం, బీజేపీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి. ఇక ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే కలిసి గవర్నర్‌ను కలిసేంత వరకు కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని రాజకీయవర్గాలు భావించాయి. కానీ ఇక్కడే ఎవరూ ఊహించని తమ భిన్నమైన వ్యూహాన్ని బీజేపీ నాయకత్వం అమలు చేసింది. సాధారణంగా బీజేపీ వ్యూహాలు మిగతా పార్టీలకు కాస్త భిన్నంగా ఉంటాయి. తాము బలపడటం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థులు బలహీనపడేలా చేయడం కూడా అంతే ముఖ్యం అనే స్ట్రాటజీని బీజేపీ ఫాలో అవుతుంటుంది.

    తాజాగా మహారాష్ట్రలోనూ బీజేపీ ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేనను దెబ్బకొట్టడం ఎంత ముఖ్యమో.. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackrey) కుటుంబం సమీప భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా చేయాలన్నదే బీజేపీ అసలు వ్యూహం. శివసేన హిందూత్వ నుంచి దూరం జరిగిందని.. అందుకే తాము ఉద్ధవ్ థాక్రేకు ఎదురుతిరిగామని ఏక్‌నాథ్ షిండే సహా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. మహారాష్ట్రలో అధికారం సొంతం చేసుకునేందుకే శివసేనను బీజేపీ చీల్చిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. వాటిని దూరం చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో శివసేనను(Shiv Sena) థాక్రే కుటుంబం మళ్లీ బలోపేతం చేయకుండా చూడాలని బీజేపీ భావిస్తోంది.

    అందుకే తమదే అసలు శివసేన అని కోర్టులో కూడా వాదించిన ఏక్‌నాథ్ షిండేను(Eknath Shinde) ముఖ్యమంత్రిని చేసి.. శివసేనకు తాము మద్దతు ఇచ్చామనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఇక ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఆయన శివసేన పార్టీని పూర్తిగా తన అదుపులోకి తీసుకునేందుకు అవకాశం దక్కుతుందని.. ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు సహా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడా షిండే తనకు దగ్గరయ్యేలా చూసుకుంటారని బీజేపీ యోచిస్తోంది.



    అలా శివసేన పార్టీని పూర్తిగా థాక్రే ఫ్యామిలీకి దూరం చేయడం ద్వారా వారిని రాజకీయంగా దెబ్బకొట్టవచ్చనే భావనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక శివసేనను ఏక్‌నాథ్ షిండే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటే.. థాక్రే పార్టీని బలోపేతం చేయడం కంటే ముందు.. పార్టీ తమదే అని నిరూపించుకోవడానికి న్యాయం పోరాటం చేయడానికే సరిపోతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

    CM Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన ట్విస్ట్.. సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. కాసేపట్లో ప్రమాణ స్వీకారం

    Maharashtra: మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ సర్కార్.. ఏక్‌నాథ్ షిండేకు దక్కేదేమిటి ?.. కొత్త టార్గెట్

    ఇక షిండేను సీఎం చేయడం ద్వారా కీలకమైన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)లోనూ థాక్రే పెత్తనానికి చెక్ చెప్పొచ్చనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. బీఎంసీలో శివసేనకు చెక్ చెబితే.. ఆ తరువాత శివసేన ఎవరి చేతిలో ఉన్నా.. ఆ పార్టీ క్రమంగా బలహీనపడటం ఖాయమని బీజేపీ ప్లాన్ చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా అనేక ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసేందుకు వీలుగా ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ.. మహారాష్ట్రలో మరింత బలపడేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తుందనే చర్చ సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Eknath Shinde, Maharashtra, Shiv Sena, Uddhav Thackeray

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు