2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన బీజేపీ(BJP).. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అదే రకమైన జైత్రయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో తిరుగులేని పార్టీగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి ఓట్లు తక్కువగా పోలింగ్ బూత్‌లు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి బూత్‌లను గుర్తించి, వాటిలో 100 బూత్‌ల ఎంపీలు, 25 బూత్‌ల ఎమ్మెల్యేలు పని చేసే బాధ్యతను మొదట బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా(JP Nadda) ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ ఇచ్చారు. దీంతోపాటు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) రాబోయే ఏడాది పాటు దేశం మొత్తం పర్యటించేలా బీజేపీ రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లకు సంబంధించి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
దీని బాధ్యత జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు అప్పగించారు. ఐదు రాష్ట్రాలలో నాలుగింటిలో భారీ విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై ఫోకస్ చేసింది. 2024లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీకి భారీ విజయాన్ని అందించే బాధ్యతను ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ప్రధాన మంత్రి వచ్చే ఏడాది పాటు దేశమంతటా పర్యటిస్తారు. ఇందులో పరిపాలనా, పార్టీ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ పర్యటనల ఏర్పాట్లకు బీజేపీ కూడా ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కన్వీనర్‌గా, జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హాకు కో-కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. మధ్యప్రదేశ్ మాజీ సంస్థాగత మంత్రిగా కూడా పనిచేసిన జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ ఇందులో చేరారు. ఈ బృందంలో మహిళల తరపున జాతీయ కార్యదర్శి అల్కా గుర్జార్ కూడా ఉన్నారు. అదే సమయంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ మాజీ సంస్థాగత మంత్రి ప్రద్యుమన్ కుమార్, అలాగే బిజెపి నాయకుడు రాజ్ కుమార్ పుల్వారియా, యువమోర్చా ప్రధాన కార్యదర్శి రోహిత్ చాహల్ కూడా ఈ టీమ్‌లో ఉన్నారు.
Vijaya Shanti: ‘‘సొంత పార్టీ నాయకుల తిరుగుబాటుతోనే సీఎం పీఠం వదులుకుంటున్నారు ’’: విజయశాంతి
Gali Janardhana Reddy : అనుకుంటే సీఎం అవుతా : గాలి జనార్ధన్ రెడ్డి -బీజేపీ హైకమాండ్ ఓకే?
ప్రధానమంత్రి పర్యటనలు, కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర బృందాలు కలిసి ప్రధాని చేసే అన్ని కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రాల్లోనూ ఇదే తరహా బృందాన్ని ఏర్పాటు చేస్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ 142 ర్యాలీలు నిర్వహించి లక్ష కిలోమీటర్లు ప్రయాణించారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, PM Narendra Modi