Home /News /national /

POLITICS BJP BIG PLAN BEHIND SELECTING DRAUPADI MURMU AS PRESIDENTIAL CANDIDATE HERE IS THE DETAILS AK

Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ప్రధాని మోదీ లెక్కేంటి ?.. భారీ ప్లాన్

ప్రధాని మోదీతో ద్రౌపది ముర్ము (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీతో ద్రౌపది ముర్ము (ఫైల్ ఫోటో)

Draupadi Murmu: ముర్ము రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఎంపిక చేసిన యశ్వంత్ సిన్హా కంటే రాజకీయంగా మోదీ మెరుగైన నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.

    రాజకీయ నేతలు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉంటుంది. బీజేపీ, ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ,(PM Modi) అమిత్ షా(Amit Shah) వ్యూహం ఏంటన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముర్మును(Draupadi Murmu) రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం ప్రధానంగా కనిపిస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు. అందులోనూ గిరిజనుల(Tribals) దృష్టిని కూడా బీజేపీ వైపు తిప్పుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా నామినేట్ చేసింది బీజేపీ. ఇప్పుడు గిరిజన ఆదివాసి తెగకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది.

    ఒడిశా, జార్ఖండ్‌లలో పట్టు సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ప్రకటించడాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోందనే చర్చ కూడా సాగుతోంది. ఒడిశాకు చెందిన ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. ముర్మును రాష్ట్రం నుండి మొదటి రాష్ట్రపతి అభ్యర్థిగా పిలవడం ద్వారా బీజేపీ ఒడియా ఓటర్లను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. ఇది రాష్ట్రపతి ఎన్నికలలో BJD మద్దతును కూడా తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో ఒడిషాలో బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారొచ్చు.

    ముర్ము రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఎంపిక చేసిన యశ్వంత్ సిన్హా కంటే రాజకీయంగా మోదీ మెరుగైన నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు 20కి పైగా పేర్లను చర్చించాయని, ముర్ము పేరును ఖరారు చేశాయని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశంలోని మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఉజ్వల, స్వచ్ఛ భారత్, పేదలకు ఉచిత రేషన్ వంటి వివిధ సంక్షేమ పథకాల కారణంగా మహిళా ఓటర్లు బీజేపీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా మారారని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇటీవలి నెలల్లో పార్టీ దృష్టి గిరిజనులపైకి మళ్లింది.

    Rahul Gandhi: ఈడీ అధికారులు నన్ను అడిగిన చివరి ప్రశ్న ఇదే.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

    Maharashtra| Uddhav Thackeray: సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రెడీ.. ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

    తాజాగా జూన్‌లో జేపీ నడ్డా రాంచీలో పర్యటించారు. అక్కడ ఆయన భగవాన్ బిర్సా ముండాను ప్రశంసించారు. గిరిజనులకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, నరేంద్ర మోదీ కూడా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గిరిజనులను ఆకర్షిస్తున్నారు. నడ్డా ఈ ఏడాది మేలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో పెద్ద గిరిజన పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాలలో గిరిజనులు నిర్ణయాత్మక శాతం ఉన్నందున ముర్ము పేరు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభలో 47 రిజర్వ్‌డ్ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నందున, ఇది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడగా కొందరు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Draupadi Murmu, PM Narendra Modi, President Elections 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు