హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గుజరాత్ లో బీజేపీ దూకుడు..క్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం

గుజరాత్ లో బీజేపీ దూకుడు..క్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం

వెనకంజలో జడేజా భార్య

వెనకంజలో జడేజా భార్య

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Gujarat Assembly Election Results) బీజేపీ (Bjp) స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఫలితాల ప్రకారం బీజేపీ 97 స్థానాల్లో విజయం సాధించి మరో 58 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో ప్రభావం చూపలేకపోయాయి. ఇక జామ్ నగర్ నార్త్ నియోజకవర్గంలో బీజేపీ  అభ్యర్థిగా బరిలోకి దిగిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై సుమారు 61 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇక వీరంగామ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన హార్దిక్ పటేల్ (Hardik Patel) వెనకంజలోనే ఉన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాద్వి (Isudhan Gadhvi) ఓడిపోయినట్లు తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

AAP : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్ .. గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షం అవుతుందా?

ఇది కూడా చదవండి : Gujarat Results : గుజరాత్ ఫలితాలతో దేశంలో వచ్చే మార్పులేంటి?

గుజరాత్ చరిత్రలో రికార్డ్ బ్రేక్..

కాగా గుజరాత్ చరిత్రలో బీజేపీ రికార్డ్ బ్రేక్ చేసింది. గుజరాత్ లో మ్యాజిక్ ఫిగర్ 92 కాగా ప్రస్తుతం కమలం పార్టీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అయిన రెండు సార్లు అధికారంలోకి వస్తే మూడోసారి వ్యతిరేక పవనాలు వీస్తాయనే అంచనా ఉంది. కానీ ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. 1995లో 121 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాగా..1998లో 117, 2002లో 127, 2007లో 117, 2012లో 115, 2017లో 99 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఈసారి ఏకంగా 150 స్థానాల్లో ఆధిక్యంతో నయా రికార్డ్ సృష్టించనుంది.

కాంగ్రెస్ ఓట్లను చీల్చిన ఆప్..బీజేపీకి పరోక్ష మేలు..

గుజరాత్‌లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్షంగా మేలు చేస్తోంది. కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో.. అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. అందువల్లే కమలం పార్టీకి అత్యధిక స్థానాలు వస్తున్నాయి.

ఏడోసారి అధికారంలోకి బీజేపీ..

ఇక గుజరాత్ లో వెలువడుతున్న ఫలితాలు బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెడుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారంలోకి రానుంది. అది కూడా ఏ పార్టీ సాధించని రికార్డ్ స్థాయిలో స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. ఇక బీజేపీ అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకే. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది. అయితే హిమాచల్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది.

First published:

Tags: AAP, Bjp, Congress, Gujarat, Gujarat Assembly Elections 2022, Ravindra Jadeja

ఉత్తమ కథలు