హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video viral: ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌నే రోడ్డుపై ఈడ్చుకెళ్లారు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

Video viral: ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌నే రోడ్డుపై ఈడ్చుకెళ్లారు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

SwatiMaliwal(Photo:Twitter)

SwatiMaliwal(Photo:Twitter)

Delhi Video viral: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ స్వాతి మలివాల్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేసిన వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. స్వాతి మలివాల్‌ను ఈడ్చుకెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో బీజేపీ నేతలు ఆప్ సర్కారును విమర్శించడం మొదలుపెట్టాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ స్వాతి మలివాల్‌(Swathi Maliwal)ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేసిన వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. స్వాతి మలివాల్‌ను ఈడ్చుకెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో బీజేపీ (BJP)నేతలు ఆప్ సర్కారును విమర్శించడం మొదలుపెట్టాయి. అందుకు తామేం తక్కువ కాదన్నట్లుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal)లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా(Saxena)కు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు పక్కనపెట్టి శాంతి భద్రతలపై దృష్టి పెడితే తాము కూడా సహాకరిస్తామని ట్వీట్‌(Tweet) చేశారు కేజ్రీవాల్. అసలు ఒక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌పై దేశ రాజధానిలో అవమానం జరిగితే ఆ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేసుకోవడం ఏమిటని విపక్షాలు నిలదిస్తున్నాయి.

Love Story: ప్రియుడితో పెళ్లి చేయమని యువతి ఆమె అమ్మమ్మ దీక్ష .. లవ్ స్టోరీలో అదే అసలు ట్విస్ట్ ..

దేశ రాజధానిలో అరాచకం..

దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులు, దాడులతో మహిళలు భయపడుతున్న సమయంలో మరో దురదృష్ట సంఘటన జరగడం విచారకరం. అది కూడా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌ నగరంలో మహిళలకు ఎలాంటి భద్రత లభిస్తోందనే విషయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో దుండగులు ఆమెను ఇబ్బంది పెట్టారు. సంచలనం సృష్టించిన ఈసంఘటన తాలుక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. గురువారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ బస్టాండ్‌లో నిలబడ్డారు స్వాతి మలివాల్. అదే సమయంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి ఆమె నిలబడిన దగ్గర కారు ఆపి కూర్చొమని అడిగితే అందుకు ఆమె తమ బంధువులు వస్తున్నారని చెప్పడంతో కారును కొద్దిగా ముందుకు తీసుకెళ్లి మళ్లీ రివర్స్ చేసుకొని రావడం సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డైంది.

వైరల్ అవుతున్న వీడియో..

కారులోని వ్యక్తి తననే ఫాలో అవుతున్నాడని భావించిన స్వాతిమలివాల్ ఆగ్రహంతో తనను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావ్ అంటూ గట్టిగా మాట్లాడుతూ కారు కీ తీసుకునేందుకు విండోలోంచి చేయి లోపల పెట్టడంతో లోపలున్న వ్యక్తి అద్దం పైకి లాగి మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ను 15మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు ఈవీడియో బయటకు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ సర్కారు పాలనలో ఢిల్లీలో మహిళల భద్రతపై విమర్శలు చేశారు. దానికి కొనసాగింపుగానే కేజ్రీవాల్ సైతం ట్విట్టర్‌ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

రాజకీయ పార్టీల పరస్పర విమర్శలు..

ఢిల్లీకి సమీపంలోని కంజావాలాలో 20ఏళ్ల వయసున్న యువతిని నలుగురు దుండగులు కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకొని వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈఘటనపైనే మహిళలకు భద్రత ఎలా ఉందో పరిశీలించే క్రమంలోనే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ దాడికి గురయ్యారు. దానిపై బీజేపీ , ఆప్ ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి.

First published:

Tags: Delhi news, Viral Video

ఉత్తమ కథలు