Yogi Adityanath On 2024 Elections : ఇవాళ(ఫిబ్రవరి-5,2023)ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చినదానికన్నా కూడా 2024 ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందని సీఎం యోగి తెలిపారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని.. అభివృద్ధి వేగం బుల్లెట్ రైలుతో సమానంగా ఉందన్నారు. తాము ఉత్తరప్రదేశ్ నుండి మెరుగైన ఫలితాలను పార్టీకి అందిస్తాము అని అన్నారు. ప్రతిపక్షాల విభజన రాజకీయాలను రాష్ట్రం మరోసారి తిరస్కరిస్తుందని సీఎం యోగి అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని యోగి ఆదిత్యనాథ్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహంలో భాగంగా యాదవులు, జాతవులు మరియు పస్మాండ ముస్లింలలో తన పునాదిని విస్తరించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం...UP జనాభాలో యాదవులు 11 శాతం ఉన్నారు. జనాభాలో దళితులు దాదాపు 21 శాతం కాగా, ముస్లింల ఉనికి 18 శాతంగా అంచనా వేయబడింది. దళితుల్లో, జాతవులు సంఖ్యాపరంగా బలంగా ఉన్నారు. యుపిలో 17 లోక్‌సభ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. యాదవ్ మరియు ముస్లిం ఓటర్లు ఒక్కొక్కరు 10 లోక్‌సభ నియోజకవర్గాలను నిర్ణయిస్తారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పోటీ చేసిన 78 లోక్‌సభ స్థానాలకు 62 గెలుచుకుంది, భారతదేశంలో రాజకీయంగా ముఖ్యమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం ఒక స్థానాన్ని గెల్చుకుంది.
Yogi To News 18 : భారతీయ ముస్లింలపై ఆ వ్యాఖ్యలు సమర్థిస్తున్నా..న్యూస్ 18 ఇంటర్వ్యూలో సీఎం యోగి
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని యూపీ సీఎం అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 ఏళ్లలో 5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. వచ్చే 2-4 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు యుపి ప్రభుత్వం రాష్ట్రం, దేశం మరియు ప్రపంచం నుండి పెట్టుబడిదారులను ఆహ్వానించిందన్నారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలనే లక్ష్యాన్ని సాధించాలనుకుంటుందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ లక్ష్యంలో పెద్ద పాత్ర పోషించవలసి ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ నెట్‌వర్క్ 18 ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. ఉత్తర ప్రదేశ్ వృద్ధి రేటు 13 నుండి 14 శాతం మధ్య ఉందన్నారు. కోవిడ్ సవాలును యూపీ ఎదుర్కొంటూనే రాష్ట్రంలో GDP,తలసరి ఆదాయం రెట్టింపు అయిందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Uttar pradesh, Yogi adityanath