హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Exit Polls: బీహార్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్, ఏ సర్వే ఏం చెబుతోంది?

Bihar Exit Polls: బీహార్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్, ఏ సర్వే ఏం చెబుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. 122 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ 15 ఏళ్ల నుంచి పదవిలో ఉన్నారు.

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ కూడా ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ - సీ ఓటర్ సర్వే, రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వే, ఏబీపీ - సీ ఓటర్ సర్వేలు రిలీజ్ అయ్యాయి.  ఆ సర్వేల ప్రకారం అటు బీజేపీ - జేడీయూ కూటమికి, ఇటు ఆర్జేడీ - కాంగ్రెస్ మహాకూటమికి కూడా పోటాపోటీగా సీట్లు ఇచ్చాయి. టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే పోటాపోటీగా ఉంది. రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వే మాత్రం ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఏబీపీ సీ ఓటర్ సర్వే కూడా ఎన్డీయేకు, మహాకూటమికి దాదాపు సమానమైన అవకాశాలు ఉంటాయని చెప్పింది.

  TimesNow- CVoter Survey

  ఎన్డీయే - 116

  మహాకూటమి - 120

  ఎల్జేపీ - 1

  ఇతరులు - 6

  Republic - Jan ki Baat Survey

  ఎన్డీయే - 91- 117

  మహాకూటమి - 118-138

  ఎల్జేపీ - 5-8

  ఇతరులు - 3- 6

  ABP-CVoter Survey

  ఎన్డీయే - 104-128

  మహాకూటమి - 108-131

  ఎల్జేపీ -

  ఇతరులు - 4-8

  TV9 Network

  ఎన్డీయే - 110-120

  మహాకూటమి - 115-125

  ఎల్జేపీ - 3-5

  ఇతరులు - 10-15

  Todays Chanakya  Survey

  ఎన్డీయే -  44-56 (34 శాతం ఓట్లు (+/- 3 శాతం)

  మహాకూటమి - 169-191 (44 శాతం ఓట్లు (+/- 3 శాతం)

  ఇతరులు -  4-12 (22శాతం ఓట్లు (+/- 3 శాతం)

  Newsx DV Research

  ఎన్డీయే - 110-117

  మహాకూటమి - 108-123

  ఎల్జేపీ - 4-10

  ఇతరులు - 8-23

  ETG Bihar

  ఎన్డీయే - 114

  మహాకూటమి - 120

  ఎల్జేపీ - 3

  ఇతరులు - 6

  Dainik Bhaskar

  ఎన్డీయే - 120-127

  మహాకూటమి - 71-81

  ఎల్జేపీ - 12-23

  ఇతరులు - 19-27

  India Today-Axis My India

  ఎన్డీయే - 69 - 91

  మహాకూటమి - 139-161

  ఎల్జేపీ - 3-5

  ఇతరులు - 0

  బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. 122 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది.  నితీష్ కుమార్ తనకు ఇవి చివరి ఎన్నికలు అని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో అక్టోబర్ 28న 71 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత రెండో దశలో నవంబర్ 3న 94 సీట్లకు, ఈరోజు మూడో దశలో 78 సీట్లకు పోలింగ్ జరిగింది.

  ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా

  మరోవైపు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ హవా ఉంటుందని India Today-Axis My India సర్వే అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా 54 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్ (28), గుజరాత్ (8), యూపీ (7), కర్ణాటక (2), జార్ఖండ్ 2, ఒడిశా 2, నాగాలాండ్ 2, తెలంగాణ 1, హర్యానా 1, ఛత్తీస్ గఢ్ 1లో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. India Today-Axis My India సర్వే ప్రకారం బీజేపీకి 16 -18 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 10 - 12 సీట్లు దక్కించుకోవచ్చు. యూపీలో బీజేపీ 5, ఎస్పీ 1-2, సీట్లలో గెలిచే చాన్స్ ఉంది. బీఎస్పీకి ఒక సీటు రావొచ్చు. గుజరాత్‌లో బీజేపీ 6-7 సీట్లను కైవసం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఒకటి దక్కొచ్చని అంచనా.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Bjp, Congress, JDU, Nitish Kumar

  ఉత్తమ కథలు