హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Election Results 2020: బిహార్‌లో అధికారాన్ని కాపాడుకున్న ఎన్డీయే.. నితీష్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా..

Bihar Election Results 2020: బిహార్‌లో అధికారాన్ని కాపాడుకున్న ఎన్డీయే.. నితీష్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ విజయం సాధించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సర్వం ఒడ్డిన బీజేపీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. చివరికి ఈ ఎన్నికల్లో జేడీయూ విజయం సాధించగా మరోమారు నితీష్ కుమార్ సీఎంగా అధికారం చేపట్టారు. అత్యధికంగా 74 స్థానాలు బీజేపీ సొంతం చేసుకోవటం హైలైట్.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ విజయం సాధించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సర్వం ఒడ్డిన బీజేపీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. చివరికి ఈ ఎన్నికల్లో జేడీయూ విజయం సాధించగా మరోమారు నితీష్ కుమార్ సీఎంగా అధికారం చేపట్టారు. అత్యధికంగా 74 స్థానాలు బీజేపీ సొంతం చేసుకోవటం హైలైట్.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. హోరాహోరిగా సాగిన పోరులో మేజిక్ ఫిగర్ 122 కంటేఎక్కువ స్థానాలో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంది.

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. హోరాహోరిగా సాగిన పోరులో మేజిక్ ఫిగర్ 122 కంటే ఎక్కువ స్థానాలో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంది. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమిలోని బీజేపీ హవా కొనసాగించగా, జేడీయూ మాత్రం ఢీలా పడింది. బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా స్పష్టంగా కనిపించింది. ఆయన ప్రచారంతో బీజేపీ భారీగా పుంజుకుంది. మరోవైపు జేడీయూ పోటీ చేసిన మొత్తం స్థానాల్లో కనీసం సగం చోట్లనైనా విజయం సాధించలేకపోయింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై బిహార్ ఓటర్లలో భారీ వ్యతిరేకత ఉన్నట్టుగా ఫలితాలు స్పష్టం చేశాయి. అయితే బీజేపీ విజృంభణతో కొద్దిపాటి మెజారిటీతో ఎన్డీయే బిహార్‌లో అధికారాన్ని కాపాడుకోగలిగింది.

  ఈ ఎన్నికల్లో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రయత్నాలు ఫలించలేదు. 75 స్థానాలు సాధించిన ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. మిత్రపక్షం కాంగ్రెస్ అంచనాలకు అనుగుణంగా రాణించకపోవడంతో మహాకూటమి అధికార పీఠానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకే పరిమితం అయింది. ఈ ఎన్నికల్లో అనుహ్యంగా ఎంఐఎం 5 స్థానాలను కైవసం చేసుకుంది. ఒకరకంగా మైనారిటీ ఓట్లు ఎంఐఎం వైపు మళ్లడం పలు స్థానాల్లో మహాకూటమికి విజయవకాశాలను గండికొట్టిందనే చెప్పాలి. ఇక, ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జేపీఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కేవలం ఒక్క స్థానంతోనే ఆ పార్టీ సరిపెట్టకుంది.

  ఇక, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అలాగే ఒక పోలింగ్ బూత్‌లో ఓట్లు వేసే గరిష్ట ఓటర్ల సంఖ్యను తగ్గించింది. దీంతో పోలింగ్‌ బూత్‌లతో పాటు, ఈవీఎంల సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి. అర్ధరాత్రి దాటాక బిహార్ ఎన్నికల తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

  ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 115 స్థానాలు, బీజేపీ 110 స్థానాలు, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 11 స్థానాలు, హిందుస్థానీ అవామ్ మోర్చా-సెక్యూలర్ 7 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాకూటమి నుంచి ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, వామపక్షాలు 29 స్థానాల్లో బరిలో నిలిచాయి.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Nitish Kumar, PM Narendra Modi

  ఉత్తమ కథలు