హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar New Government: బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడంటే..

Bihar New Government: బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడంటే..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ విజయం సాధించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సర్వం ఒడ్డిన బీజేపీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. చివరికి ఈ ఎన్నికల్లో జేడీయూ విజయం సాధించగా మరోమారు నితీష్ కుమార్ సీఎంగా అధికారం చేపట్టారు. అత్యధికంగా 74 స్థానాలు బీజేపీ సొంతం చేసుకోవటం హైలైట్.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ విజయం సాధించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సర్వం ఒడ్డిన బీజేపీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. చివరికి ఈ ఎన్నికల్లో జేడీయూ విజయం సాధించగా మరోమారు నితీష్ కుమార్ సీఎంగా అధికారం చేపట్టారు. అత్యధికంగా 74 స్థానాలు బీజేపీ సొంతం చేసుకోవటం హైలైట్.

ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. జేడీయూ గ్రాఫ్ పడిపోగా.. బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఐనప్పటికీ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. నితీష్ కుమార్‌నే మరోసారి సీఎంను చేస్తామని బీజేపీ తెలిపింది.

  బీహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించి.. మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ గెలుస్తాడన్న అంచనాలను తలకిందులు చేస్తూ కంఫర్టబుల్ మెజారిటీ సాధించింది. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్న బీజేపీ, జేడీయూ పార్టీలు.. వచ్చే వారం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి. దీపావళి పండుగ తర్వాత బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం లేదా మంగళవారం ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి.

  ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. జేడీయూ గ్రాఫ్ పడిపోగా.. బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఐనప్పటికీ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. నితీష్ కుమార్‌నే మరోసారి సీఎంను చేస్తామని బీజేపీ తెలిపింది. రెండు దశాబ్దాల్లో ఏడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేతగా నిలబోతున్నారు నితీష్. ఆయన మొదట 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే హంగ్ ప్రభుత్వంలో తగిన బలం లేక కొన్ని రోజులకే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005లో ఎన్డీయే ఫుల్ మెజారిటీ సాధించడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి.. మరోసారి ఆయనే సీఎం పగ్గాలు చేపట్టారు.

  ఐతే 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కానీ ఏడాదిలోపే తిరిగి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు నితీష్. 2015 నవంబరులో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమి నితీష్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో కూటమి విజయంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఐతే ఆర్జేడీతో అధికారం పంచుకోలేక.. 2017లో పదవి నుంచి నితీష్ కుమార్ దిగిపోయారు. ఆ మరుసటి రోజే బీజేపీ మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  కాగా, 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో.. ఎన్డీయే 125 సీట్లు సాధించింది. మహాకూటమి 110 సీట్లు దక్కించుకుంది.  పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ  19 స్థానాలకే పరిమితయింది. ఇక CPIMLL 11, MIM 5, HAMS 4, VIP 4,  CPM 3, CPI 2, LJP ఒక స్థానంలో గెలిచాయి.  మ్యాజిక్ మార్క్ 122 కంటే మూడు సీట్లు ఎక్కువ గెలవడంతో.. ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Bjp, JDU, Nitish Kumar

  ఉత్తమ కథలు