Home /News /national /

POLITICS BIHAR CM NITISH KUMAR STEP DOWN AS CHIEF MINISTER AFTER SUBMITTING RESIGNATION LETTER TO GOVERNOR CLAIMED SUPPORT OF 160 MLAS AK

Bihar Politics: బీహార్ సీఎంగా నితీష్ రాజీనామా.. 160 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ మరో లేఖ

బీహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

బీహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫొటో)

Bihar: అదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నితీష్.. తనకు 160 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్‌కు మరో లేఖ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    బీహార్‌లో అనుకుంటున్నదే జరిగింది. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో.. బీజేపీని వదిలించుకోవాలని డిసైడైన జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar).. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అదే సమయంలో ఆర్జేడీ,(RJD) కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మద్దతుతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నితీష్.. తనకు 160 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్‌కు మరో లేఖ ఇచ్చారు. ఎన్డీయే నుంచి విడిపోయిన తర్వాత మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీష్ కుమార్ నిర్ణయించుకున్నారు. అంతకుముందు జరిగిన మహాకూటమి సమావేశంలో నితీష్ కుమార్‌కు మద్దతు లభించినందున, సిఎం నితీష్ కుమార్ ఎన్డీయే(NDA) నుండి విడిపోతారని ఊహాగానాలు వచ్చాయి.

    పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎన్డీయే నుంచి విడిపోవాలని జేడీయూ నిర్ణయించింది. ఈ ఘటన తర్వాత నితీష్ కుమార్ రాజీనామా చేసేందుకు గవర్నర్ ఫాగు చౌహాన్ వద్దకు చేరుకున్నారు. నితీష్ కుమార్ తన రాజీనామాను ఎప్పుడైనా గవర్నర్‌కు సమర్పించవచ్చని చెప్పబడింది, అయితే చివరికి సాయంత్రం 4 గంటల సమయంలో ఆయనను కలవడానికి గవర్నర్ సమయం ఇచ్చారు. రాజీనామా చేసేందుకు నితీష్ కుమార్ ఒంటరిగా రాజ్ భవన్ చేరుకున్నారు. ఆయన రాజీనామా సమర్పించడంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

    బీహార్‌లో కొత్త అధికార సమీకరణం ప్రకారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. 160 మంది ఎమ్మెల్యేల (ఆర్జేడీ-79, జేడీయూ-45, కాంగ్రెస్-19, లెఫ్ట్-16, ఇండిపెండెంట్-1) మద్దతు లేఖతో నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పుడు బీహార్‌లో నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కొత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దానిపై అందరి దృష్టి ఉంది.



    అయితే బీహార్‌లో ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐదేళ్ల క్రితం 2017లో ప‌రిస్థితి అలాగే ఉంది.2017లో నితీష్‌ కుమార్‌ మహాకూటమిలో భాగమయ్యారు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాు. ఈ ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తేజస్వి యాదవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒకరోజు నితీష్ కుమార్ హఠాత్తుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. దీంతో మంత్రివర్గం ఆటోమేటిక్‌గా రద్దయింది. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం కలిగించింది. రెండేళ్లలోనే మహాకూటమి ప్రభుత్వం పడిపోయింది.

    మహాకూటమి నుంచి తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం పదవీకాలం కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. అయితే పోయినసారి తేజస్విపై అవినీతి ఆరోపణలే కారణం కాగా, ఈసారి బీజేపీ జేడీయూను దెబ్బతీసే అంశం తెరపైకి వచ్చింది.

    నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ టాలెంట్.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అద్భుతమైన వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

    Tallest Flag Pole: దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..!

    నితీష్‌ కుమార్‌ను సీఎం చేయాలంటూ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు తేజస్వి యాదవ్‌కు మద్దతు లేఖ అందించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి మహాకూటమికి చెందిన పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖను గవర్నర్ ఫాగు చౌహాన్‌కు అందజేశారని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bihar, Bjp, JDU, RJD

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు