హోమ్ /వార్తలు /national /

Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికకు ముందు వైసీపీకి షాక్. చంద్రబాబును కలిసిన అధికార పార్టీ నేత

Andhra Pradesh: తిరుపతి ఉప ఎన్నికకు ముందు వైసీపీకి షాక్. చంద్రబాబును కలిసిన అధికార పార్టీ నేత

వైసీపీకి షాక్

వైసీపీకి షాక్

ఏపీలో భారీగా రాజకీయ వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు, కేడర్ అంతా అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తాజాగా తిరుపతి ఉప ఎన్నికకు ముందు వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చంద్రబాబును కలిశారు.

ఇంకా చదవండి ...

ఏపీలో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను ప్రధానంగా మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరుపతిలో గెలుపుకోసం సర్వశక్తులూ వడ్డుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా తిరుపతిలోనే మకాం వేసి తమ పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరపున అధినేత చంద్రబాబు. జాతీయ కార్యదర్శి లోకేష్ అక్కడే ఉండి.. పనబాక లక్ష్మి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. బీజీపీ నేతలంతా అక్కడడే మకాం వేశారు. ఇక త్వరలోనే జాతీయ నేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇటు మిత్రపక్ష అభ్యర్థి రత్న ప్రభ కోసం జనసేన అధినేత పవన్ ప్రచారం నిర్వహించారు. మరోసారి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక అధికార పార్టీ తమకు గెలుపు గురించి టెన్షన్ లేదని.. మెజార్టీ 5 లక్షలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు. మంత్రులంతా తిరుపతిలోనే ఉండే గురుమూర్తి గెలుపుకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నెల 14న అధినేత జగన్ సైతం ప్రచారానికి వస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలు మూడూ తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దూకుడు చూపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా విపక్షాల నుంచి వైసీపీ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత చాలా జిల్లాల్లో కీలక టీడీడీపీ నేతలు అధికార పార్టీలోకి చేరుతున్నారు.  ఇలాంటి సమయంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ కీలక నేత మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి.. శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. కడప జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ నేత.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం రాయచోటికి చెందిన వ్యక్తే అయినా తిరుపతిలోనే మంచి పట్టు ఉందని.. అందుకే సరిగ్గా జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్న రోజునే ఆయన టీడీపీలో చేరాని నిర్ణయించారు. వైసీపీలపో ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని మండిపల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ, అసంతృప్తికి లోనై టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక ముందు ఈ పరిణామం వైసీపీకి షాక్ లాంటింది.

మరోవైపు తిరుపతిలోనే రెండో రోజూ దూకుడుగా చంద్రబాబు ప్రచారం కొనసాగించారు. ఆయన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. చంద్రబాబు రోడ్‌షోలకు, ప్రచార సభలకు జనం భారీగా పోటెత్తుతున్నారు. అడుగడుగునా ఆయనకు నీరాజనం పట్టారు. టీడీపీ ఈ సీటు గెలవడంతో అధికారంలోకి రాదని.. కానీ ఆకాశంపై కూర్చున్న జగన్ ను కిందకు దించొచ్చు అన్నారు చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా 151 దేవాలయాలపై దాడులు జరిగాయని.. ఈ ఉప ఎన్నికలో టీడీపీ గెలిపించి తిరుపతిని కాపాడుకోవాలని చంద్రబాబు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరూ వదలను అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP, Tirupati Loksabha by-poll, Ycp

ఉత్తమ కథలు