హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Uddhav Thackrey: ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్.. ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. మరికాసేపట్లో ఢిల్లీ పయనం..

Uddhav Thackrey: ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్.. ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. మరికాసేపట్లో ఢిల్లీ పయనం..

ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే (ఫైల్ ఫోటో)

ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే (ఫైల్ ఫోటో)

Maharashtra: ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా శివసేన రెబల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు జై కొట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  పార్టీ ఎమ్మెల్యేలు రెబల్‌గా మారడంతో కొద్దివారాల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్ తగలబోతోందని తెలుస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా శివసేన రెబల్, మహారాష్ట్ర (Maharashtra)ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు జై కొట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 12 మంది ఎంపీలు మరికాసేపట్లో ఢిల్లీ చేరుకుని ఈ మేరకు తమ నిర్ణయాన్ని మీడియా సమావేశం ద్వారా వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. అసలే రాజకీయంగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న ఉద్ధవ్ థాక్రేకు(Uddhav Thackrey) మరో బిగ్ షాక్ తగిలినట్టే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికే ఈ రకమైన పరిణామం చోటు చేసుకోబోతోందనే వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) మద్దతు ఇవ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము అలా చేయకూడదని.. కానీ తాము సంకుచితంగా ఆలోచించడం లేదని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దేశానికి తొలిసారిగా ఓ ఆదివాసీ గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు. గతంలోనూ తాము ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలకు ఈ రకంగానే మద్దతు ప్రకటించామని అన్నారు.

  కొందరు ఎంపీలు ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఉద్ధవ్‌పై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన కాసేపటికే శివసేన ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఉద్ధవ్ థాక్రేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  మరోసారి కాల్పుల మోత... తోటి ఉద్యోగులపై పోలీసు ఫైరింగ్.. ఎక్కడంటే..

  President Of India: భారత రాష్ట్రపతి జీతం 20 ఏళ్లలో ఎంత పెరిగిందో తెలుసా.. ఇతరత్రా ప్రయోజనాలు ఇవే.. పూర్తి వివరాలు

  ఎంపీలు చేజారితే.. ఆ తరువాత ఆయనతో పాటు ఉన్న కొద్దిమంది శివసేన ఎమ్మెల్యేలు సైతం ఏక్‌నాథ్‌కు జై కొట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి శివసేన పార్టీ మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని భావిస్తున్న ఏక్‌నాథ్ షిండే వర్గం.. తాజాగా పరిణామాలతో తాము అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తోందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Eknath Shinde, Maharashtra, Shiv Sena

  ఉత్తమ కథలు