హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

TMC vs BJP : మమతకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ..ఇది మామూలు దెబ్బ కాదుగా

TMC vs BJP : మమతకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ..ఇది మామూలు దెబ్బ కాదుగా

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

Bhekutia Samabay Krishi Samity Election : వెస్ట్ బెంగాల్(West Bengal) సీఎం మమతాబెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోని TMC(తృణముల్ కాంగ్రెస్ పార్టీ)కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Bhekutia Samabay Krishi Samity Election : వెస్ట్ బెంగాల్(West Bengal) సీఎం మమతాబెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోని TMC(తృణముల్ కాంగ్రెస్ పార్టీ)కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆదివారం నందిగ్రామ్‌లోని భెకూటియా సమాబే కృషి సమితి( Bhekutia Samabay Krishi Samity)కోఆపరేటివ్ బాడీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. స‌హ‌కార‌ సంఘంలోని మొత్తం 12 స్థానాల‌కుగాను టీఎంసీ కేవ‌లం ఒక్క స్థానాన్ని మాత్ర‌మే ద‌క్కించుకుంది. మిగ‌తా 11 స్థానాల్లో బీజేపీ(BJP) విజ‌యం సాధించింది. గ‌తంలో బెకూటియా స‌మ‌బాయ్ కృషి స‌మితి టీఎంసీ కంచుకోట‌గా ఉండేది. ఇప్పుడు బీజేపీ ఆ కోఆప‌రేటివ్ బాడీని సొంతం చేసుకుంది. కాగా,2021లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలిచి సంచలనం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు మమతకు, ఆమె సారధ్యంలోని టీఎంసీకి గట్టి షాకిచ్చారు.

సువేందు బీజేపీలో చేరి గట్టిగా సవాలు విసురుతుండటంతో నందిగ్రామ్‌లో చేసే ప్రతి పోటీనీ టీఎంసీతో పాటు మమత కూడా ప్రతిష్టగా తీసుకుంటారు. భెకూటియా సమాబే కృషి సమితి కోఆపరేటివ్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంతో తృణమూల్‌ వర్గాలు డీలా పడిపోయాయి. సువేందుపై ఎలాగైనా గెలవాలనుకున్న మమతకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. నందిగ్రామ్ లో మమతను మరోసారి ఓడించాం అంటూ కమలనాథులు సంబరాల్లో మునిగిపోయారు.

Traffic Rules : పోలీసులు బండి తాళాలు తీయొచ్చా? టైర్లలో గాలి తీయొచ్చా?

వాస్తవానికి సువేందు అధికారి గతంలో టీఎంసీలోనే ఉండేవారు. మమతకు కుడిభుజం అన్న పేరు కూడా పొందారు. అయితే 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు బీజేపీలో చేరి టీఎంసీకి కంచుకోటగా ఉన్న నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. దీంతో మమత తాను చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తోన్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని సువేందు పోటీచేస్తున్న నందిగ్రామ్ నుంచి తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో సువేందు నెగ్గడంతో ఇక్కడ మమత పరాజయం పాలయ్యారు. 292 అసెంబ్లీ స్థానాలకు గానూ తృణమూల్ తొలిసారిగా 215 స్థానాలను గెలుచుకుంది. అంత స్వీప్‌లో కూడా మమత సువేందును ఓడించలేక చతికిలపడ్డారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Mamata Banerjee, West Bengal

ఉత్తమ కథలు