హోమ్ /వార్తలు /national /

రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్ బై... ఏ పార్టీతో సంబంధం లేదన్న సినీ నిర్మాత

రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్ బై... ఏ పార్టీతో సంబంధం లేదన్న సినీ నిర్మాత

బండ్ల గణేశ్(ఫైల్ ఫోటో)

బండ్ల గణేశ్(ఫైల్ ఫోటో)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. బండ్ల గణేష్‌ షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు.

ప్రముఖ సినీనిర్మాత బండ్ల గణేష్... రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్న ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని తెలిపారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నానన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. బండ్ల గణేష్‌ షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అలాగే, జూబ్లిహిల్స్ టికెట్ కోసం కూడా ప్రయత్నించారు. కానీ, ఆ రెండు చోట్లా కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల నుంచి గట్టి పోటీ ఉంది. షాద్ నగర్‌లో సి.ప్రతాపరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే, ఆ సీటు కోసం పట్టుబట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు కూడా కాంగ్రెస్‌ను వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరి రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరినా తనకు టికెట్ దక్కలేదని కొంత నిరాశపడ్డారు. మీడియా సమావేశాల్లో అతి చేస్తున్నందునే ఆయన్ను పార్టీ అధిష్టానం పక్కనపెట్టిందన్న ప్రచారం కూడా జరిగింది.

First published:

Tags: Bandla Ganesh, Congress, Rahul Gandhi, Telangana Politics, Tpcc

ఉత్తమ కథలు