ఒకప్పుడు తన మాటలతో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నిర్మాత బండ్ల గణేష్.. కొద్దికాలంగా చాలా సైలెంట్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తన కామెంట్స్‌తో రచ్చ చేసిన గణేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ తర్వాత పొలిటికల్ కామెంట్స్‌కు ఆయన దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ గణేష్.. గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పట్లో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రత్యర్థులపై పలు ఇంటర్వ్యూల్లో గణేస్ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి కూడా. ఇప్పుడు కొందరు వాటిని తిరిగి ప్రచారంలోకి తీసుకురావడంపై బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తనకు ఏ రాజకీయా పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. దయచేసి గతంలో మాట్లాడిన మాటలను ఇప్పుడు పోస్ట్ చేయవద్దని కోరారు. ఇది తన అభ్యర్థన అని పేర్కొన్నాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వరుస ఇంటర్వ్యూలతో రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలు చేశారు. ముఖ్యంగా 7'0 క్లాక్ బ్లెడ్ ఇష్యూ ఎంతగా వైరల్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి(కాంగ్రెస్, టీడీపీ కూటమి) ఓడిపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటానని ఆయన చాలెంజ్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ 🙏🙏🙏
— BANDLA GANESH. (@ganeshbandla) November 22, 2020
ఇక, చిన్న నటుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన బండ్ల గణేష్.. పెద్ద నిర్మాతగా మారాడు. పవన్ కల్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ చిత్రం ఆయనకు మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన.. రాజకీయాల్లో తన లక్కును పరిక్షీంచుకున్నారు. అయితే అది కాస్త బెడసికొట్టడంతో తిరిగి సినిమాల బాట పట్టారు. త్వరలోనే పవన్ కల్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh