హోమ్ /వార్తలు /national /

బాలకృష్ణ ప్రత్యర్థికి ఎమ్మెల్సీ పదవి...వైసీపీలో ఆసక్తికర చర్చ

బాలకృష్ణ ప్రత్యర్థికి ఎమ్మెల్సీ పదవి...వైసీపీలో ఆసక్తికర చర్చ

నందమూరి బాలకృష్ణ(File)

నందమూరి బాలకృష్ణ(File)

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణపై పోటీ చేసే అవకాశం మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు ఇచ్చారు జగన్. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా... తాజాగా ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు.

  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలకృష్ణపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఖాయం చేశారు వైఎస్ జగన్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును ఇక్బాల్‌కు ఇచ్చారు జగన్. రంజాన్’కు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్బాల్‌కు సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో హిందూపురం వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. నిజానికి 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా నవీన్ నిశ్చల్ బరిలోకి దిగారు.

  అయితే 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు ఛాన్స్ ఇచ్చారు జగన్. ఎన్నికల్లో బాలకృష్ణపై ఆయన ఓటమి పాలైనా... ఆయనకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం మళ్లీ తనకే ఇవ్వాలని నవీన్ నిశ్చల్ వైసీపీ అధినేతను కోరుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తనకు అప్పగించాలని ఆయన అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  lagadapati rajagopal,lagadapati rajagopal survey,lagadapati rajagopal press meet,lagadapati survey,lagadapati rajagopal survey 2019,lagadapati rajagopal survey latest news,lagadapati survey 2019,lagadapati,lagadapati rajagopal live,lagadapati rajagopal reddy,lagadapati rajagopal latest,lagadapati rajagopal about ap,lagadapati live,lagadapati rajagopal latest news,lagadapati rajagopal survey 2018,లగడపాటి సర్వే,లగడపాటి సర్వేపై కౌంటర్,వైసీపీ లగడపాటి,వైసీపీ లగడపాటి సర్వే
  హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్

  తాజాగా ఇక్బాల్‌కు జగన్ ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో... హిందూపురం ఇన్‌ఛార్జ్ పోస్టు కూడా ఆయనకే ఇస్తారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన జగన్... నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పోస్టును నవీన్ నిశ్చల్‌కు ఇచ్చే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీడీపీ కంచుకోట, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం సీటును కైవసం చేసుకోవడానికి సీఎం జగన్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనే అంశం ఉత్కంఠగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Balakrishna, Chandrababu naidu, Hindupuram, Ysrcp

  ఉత్తమ కథలు